వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) చెందిన ఎంపీలు భారతీయ జనతాపార్టీలోకి(BJP) వలస వెళ్లవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏ ఎంపీలు వెళతారు? రాజ్యసభ సభ్యులు వెళతారా? లోక్‌సభ సభ్యులు వెళతారా ? అన్నదాంట్లో స్పష్టత లేదు కానీ ఎంపీలు వెళతారన్న టాక్ మాత్రం వినిపిస్తోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YSRCP) చెందిన ఎంపీలు భారతీయ జనతాపార్టీలోకి(BJP) వలస వెళ్లవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏ ఎంపీలు వెళతారు? రాజ్యసభ సభ్యులు వెళతారా? లోక్‌సభ సభ్యులు వెళతారా ? అన్నదాంట్లో స్పష్టత లేదు కానీ ఎంపీలు వెళతారన్న టాక్ మాత్రం వినిపిస్తోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. అరకు నుంచి తనూజా రాణి(Thanuja Rani), తిరుపతి నుంచి గురుమూర్తి(Gurumurti), రాజంపేట నుంచి మిథున్ రెడ్డి(Mithun Reddy), కడప నుంచి అవినాష్ రెడ్డి(Avinash Reddy) గెలిచారు. ఈ నలుగురిలో మిథున్‌రెడ్డి, గురుమూర్తిలు జగన్మోహన్‌రెడ్డికి(YS Jagan) అత్యంత సన్నిహితులు. ఇక అవినాష్ రెడ్డి అయితే జగన్ కుటుంబసభ్యుడు. ఈ ముగ్గురు పార్టీ మారడానికి ఎలాంటి అవకాశం లేదు. అదే సమయంలో తనూజా రాణి వైఎస్ జగన్‌కు వీరాభిమాని. ఆమె కూడా పార్టీ మారే అవకాశాలు కనిపించడం లేదు. అయితే రాజంపేట నుంచి గెలిచిన మిథున్ రెడ్డికి పలు వ్యాపారాలు ఉన్నాయి. బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ప్యానెల్ స్పీకర్‌గా కూడా పని చేశారు. చాలా రాష్ట్రాలలో ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. అందుకే మిథున్‌రెడ్డి బీజేపీలోకి వెళతారు అన్న ప్రచారం సాగుతోంది. అదీ కాకుండా తెలుగుదేశంపార్టీ ఆయనను వేధిస్తోంది అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇంతకీ మిథున్ పార్టీ మారతారా? ఈ వీడియోలో చూద్దాం