పొంగల్ మండుతున్న సమయం లో తీసిన సుధమూర్తి ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఎంతో నిరాడంబరం గా ఈ వేడుకల్లో పాల్గొన్న ఒక ఫోటో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయింది. చిన్నప్పుడు ఇలాంటి పల్లెటూరి నేపథ్యంలో పెరిగాను అందుకే ఇది తనకు కష్టం గా లేదని చెప్పారు ఆమె . మరో సారి ఆమె సహజత్వాన్ని ఉట్టిపడేలా ఉన్న ఆమె ఫోటో కి కామెంట్స్ రూపం లో అభిమానం వెల్లువెత్తుతోంది .
సుధామూర్తి. ఈ పేరు ఈమధ్య సోషల్ మాధ్యమాలలో వచ్చే మోటివేషనల్ వీడియోస్ చూసే చాలామందికి తెల్సి ఉంటుంది. ఈమె ఎవరో కాదు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ N R నారాయణమూర్తి భార్య . దాదాపుగా 35 వేలకోట్ల ఆస్థి ఉన్న కూడా ఒక మధ్య తరగతి మహిళా లుక్ తో ఉంటుంది సుధామూర్తి . ఈమె టీచర్ ,రచయిత్రి ,మోటివేషనల్ స్పీకర్ . సుధా మూర్తి స్పీచెస్ ఈ మధ్యకాలంలో సోషల్ మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అయ్యాయి. ఆవిడా చెప్పిన ప్రతి మాట తన నిజజీవితంలో ఎదురైనా అనుభవాలే కావటం విశేషం . నిత్యం నిమిషం తీరిక లేకుండా 24 గంటలు ఇన్ఫోసిస్ సాధనలో నిమగ్నమైన నారాయణమూర్తిని తాను కూడా అందరి భార్యల్లా ప్రవర్తించి ఉంటే ఈ రోజు ఇన్ఫోసిస్ ఇంత గొప్పస్థాయిలో ఉండేది కాదేమో !అందుకే అయన పనిలో ఎపుడు నాకోసం సమయం ఇమ్మని అడిగేదాన్నికాదని తన సొంత గుర్తింపు కోసం చేసే తన జర్నీ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేదాన్ని చెప్పే సుధామూర్తి మాటలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం .
డబ్బు వల్ల వచ్చే గుర్తింపుని తన జీవితానికి ఎప్పుడు అంటనివ్వకుండా ఎపుడు ఒక మధ్యతరగతి మహిళలాగానే కనిపిస్తారామె. ఒక సాధారణ కాటన్ చీరతో చిరునవ్వుతో కనిపిస్తారు. ఆడంబరలకు దూరంగా ఉంటారు. ఈ మధ్యకాలం లో సుధామూర్తి గారి స్పీచెస్ ఇన్ఫోసిస్ నారాయణ భార్యగా కన్నా ఆమెకు ఎక్కువ గుర్తింపుతెచ్చి పెట్టాయి . వీపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది సుధామూర్తికి . ఇటీవల సుధామూర్తిగారు కేరళలో జరిగే అట్టుకల్ భగవతి దేవి ఉత్సవాల్లో పాల్గొనటానికి వచ్చింది.
సుధామూర్తి ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఒక కారణం ఉంది . 2019 కేరళ వరదల సమయం లో పర్యావేక్షణ కోసం వచ్చినపుడు ఈ ఉత్సవాల గురించి విన్నారాట ఆమె. ఒక్కసారైనా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆమె కోరిక చెప్పటం తో ఆమెకు ఆ అవకాశం ఇప్పటికి కుదిరింది . దాంతో ఏర్పాట్లు చూడామని కేరళ లో ఉన్న స్నేహితురాలికి చెప్పగా సుధామూర్తి మంగళవారం ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ ఉత్సవం లో పొంగల్ తయారీ సమయంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నతీరు ఎంతో ఆకట్టుకున్నదని నెయ్యి అటుకులు బెల్లం,కొబ్బరి తో చేసిన పొంగల్ ప్రసాదం నైవేద్యంగా ఇచ్చిన తర్వాత ప్రసాదాన్ని ఇంటి సభ్యులతో పంచుకుంటానని మరి చెప్పారు
పొంగల్ మండుతున్న సమయం లో తీసిన సుధమూర్తి ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఎంతో నిరాడంబరం గా ఈ వేడుకల్లో పాల్గొన్న ఒక ఫోటో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయింది. చిన్నప్పుడు ఇలాంటి పల్లెటూరి నేపథ్యంలో పెరిగాను అందుకే ఇది తనకు కష్టం గా లేదని చెప్పారు ఆమె . మరో సారి ఆమె సహజత్వాన్ని ఉట్టిపడేలా ఉన్న ఆమె ఫోటో కి కామెంట్స్ రూపం లో అభిమానం వెల్లువెత్తుతోంది .