భారతదేశం(India) చంద్రమండలంపైకి వెళుతుంటే, పాకిస్థానేమో(Pakistan) పక్క దేశాలను అడుక్కుంటోందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Nawaz Sharif) విమర్శించారు. పాకిస్తాన్‌ను పాలించిన గత ప్రధానులు అవినీతికి పాల్పడి, దేశాన్ని అధోగతి పాలు చేశారని ఆరోపించారు. నిధులు సమకూర్చండంటూ పక్కదేశాను పాకిస్తాన్ ప్రధాని అడుక్కుంటున్నారని, మన పక్కనే ఉన్న భారతదేశం చంద్రుడిపైకి వెళ్లిందని షరీఫ్ చెప్పుకొచ్చారు.
భారతదేశం(India) చంద్రమండలంపైకి వెళుతుంటే, పాకిస్థానేమో(Pakistan) పక్క దేశాలను అడుక్కుంటోందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Nawaz Sharif) విమర్శించారు. పాకిస్తాన్‌ను పాలించిన గత ప్రధానులు అవినీతికి పాల్పడి, దేశాన్ని అధోగతి పాలు చేశారని ఆరోపించారు. నిధులు సమకూర్చండంటూ పక్కదేశాను పాకిస్తాన్ ప్రధాని అడుక్కుంటున్నారని, మన పక్కనే ఉన్న భారతదేశం చంద్రుడిపైకి వెళ్లిందని షరీఫ్ చెప్పుకొచ్చారు. జీ 20(G-20) వంటి ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశాలకు భారత్ వేదికగా మారిందని, పాకిస్తాన్ ఇలాంటివాటిని ఎందుకు సాధించలేకపోతున్నదని ప్రశ్నించారు. ఈ దుస్థితికి కారణమెవరని నిలదీశారు షరీఫ్. వాజపేయి(Vajpayee) ప్రధానిగా ఉన్న సమయంలో భారత్ దగ్గర నిల్వలు చాలా తక్కువగా ఉండేవని, ప్రస్తుతం వారి నిల్వలు 600 బిలియన్ డాలర్ల వరకు చేరాయని నవాజ్ షరీఫ్ అన్నారు.
లాహోర్(Lahore) వేదికగా జరిగిన బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్ నుంచి మాట్లాడిన షరీఫ్ 'పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా దిగజారిపోతోంది. పేద ప్రజలకు తిండి పెట్టలేని దుస్థితికి చేరింది. ద్రవ్యోల్భణం రెండంకెల సంఖ్యకు చేరింది. పాకిస్థాన్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి జులైలో ఐఎంఎఫ్‌కు 1.2 బిలియన్ అమెరికా డాలర్లను సమకూర్చింది' అని చెప్పుకొచ్చారు. నవంబర్ 2019లో నవాజ్ షరీఫ్‌కు అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. వైద్య కారణాలతో దేశం విడిచి బ్రిటన్‌లో నివసిస్తున్నారు షరీఫ్. ఈ ఏడాది అక్టోబర్ 21న ఆయన పాకిస్థాన్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. లాహోర్‌కు రాకముందే ఆయనకి బెయిల్ మంజూరు చేస్తామని PML-N పార్టీ చెబుతోంది. బ్రిటన్ నుంచి తిరిగి వచ్చి వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించనున్నారని పార్టీ నాయకులు తెలిపారు. చిత్రమేమిటంటే అవినీతి ఆరోపణలలో కూరుకుపోయిన నవాజ్ షరీఫ్ అవినీతి గురించి మాట్లాడటం!