జనవరి 3 తేదీ నుంచి ఆస్ట్రేలియా-పాకిస్తాన్(AUS vs PAK) మధ్య మూడో, చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు చివరి టెస్ట్ మ్యాచ్ కానుంది. ఈ సమయంలో వార్నర్ తన బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని వార్నరే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు.
జనవరి 3 తేదీ నుంచి ఆస్ట్రేలియా-పాకిస్తాన్(AUS vs PAK) మధ్య మూడో, చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు చివరి టెస్ట్ మ్యాచ్ కానుంది. ఈ సమయంలో వార్నర్ తన బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని వార్నరే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. 'మెల్‌బోర్న్(David Warner) నుంచి సిడ్నీ వచ్చే క్రమంలో లగేజ్ నుంచి నా బ్యాక్‌ప్యాక్‌ను (బ్యాగ్)ని ఎవరో తీసుకున్నారు. అందులో నా పిల్లల వస్తువులు ఉన్నాయి. నా బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉంది. అది నాకెంతో సెంటిమెంట్. దానిని ధరించి నా చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నా. కావాలని ఎవరైనా బ్యాక్‌ప్యాక్‌ను తీసుకుంటే వారికి మరో బ్యాక్‌ప్యాక్ ఇస్తాను. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురిచేయను. ఎయిర్‌పోర్ట్, హోటల్ సిబ్బందిని కూడా అడిగాను. సీసీటీవీ ఫుటేజీలు కూడా పరిశీలించాం. ఎక్కడ దాని జాడ దొరకలేదు. దయచేసి నా బ్యాగీ గ్రీన్ క్యాప్‌ని తిరిగి ఇస్తే ఎంతో ఆనందిస్తాను’ అని వార్నర్ విజ్ఞప్తి చేశాడు. సిడ్నీ వార్నర్ హోమ్ గ్రౌండ్. ఈ మ్యాచ్‌తో టెస్ట్‌ల నుంచి తప్పుకుంటున్నట్టు గతంలోనే వెల్లడించాడు వార్నర్. వన్డేల నుంచి కూడా వైదొలుగుతున్ట్టు సోమవరాం ప్రకటించాడు. భారత్‌లో ఆడిన వన్డే ప్రపంచకప్ ఫైనలే తనకు 50 ఓవర్ల ఫార్మాట్లో చివరి మ్యాచ్ అని పేర్కొన్నాడు. కానీ, జట్టుకు అవసరమైతే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని తెలిపాడు.