ఏపీ బీజేపీ(AP BJP) అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి(Daggupati Purandeshwari) శుక్రవారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి(Vizag Airport) చేరుకున్నారు. ఢిల్లీ నుండి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.

Daggupati Purandeshwari
ఏపీ బీజేపీ(AP BJP) అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి(Daggupati Purandeshwari) శుక్రవారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి(Vizag Airport) చేరుకున్నారు. ఢిల్లీ నుండి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమె విశాఖ పర్యటనకు వచ్చారు. పురందేశ్వరికి ఆహ్వానం పలికిన వారిలో ఏపీ బీజేపీ ప్రోటోకాల్ కన్వీనర్ బాల రాజేశ్వరరావు(Balakrishna rao), విశాఖ బీజేపీ అధ్యక్షుడు మేడిపాటి రవీంద్ర(Ravindhra), కాశి రాజు(Kasi Raju), మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, పలువురు ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు కూడా భారీగా ఉన్నారు.
