పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో.. పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ బంగారు పతకం సాధించి వార్తల్లో నిలిచాడు. నీరజ్ చోప్రా వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. తన కొడుకు సాధించిన ఈ ఘనతపై అతని తల్లి కూడా సంతోషం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ఆటగాడి గురించి కూడా ఆమె పెద్ద విషయం చెప్పింది.

నీరజ్ తల్లి సరోజ్ దేవి.. తన కొడుకు సాధించిన ఈ ఘనతపై స్పందించింది. మాకు వెండి బంగారంతో సమానం.. మాకు చాలా సంతోషంగా ఉంది.. స్వ‌ర్ణం గెలిచినవాడు మా కుమారుడే.. కష్టపడి గెలిచాడు. ప్రతి క్రీడాకారుడికి ఒక‌ రోజు ఉంటుంది.కాబట్టి మేము అతని ప్రదర్శనతో సంతోషంగా ఉన్నాము. నీరజ్ చోప్రా రాగానే.. నేను అతనికి ఇష్టమైన వంట చేస్తానని చెప్పింది. నీరజ్ చోప్రా తల్లి పాకిస్తానీ ఆటగాడు అర్షద్ నదీమ్‌కు శుభాకాంక్షలు తెలిపింది.

అర్షద్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల నీరజ్ తండ్రి కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఒత్తిడి తీసుకురాలేం.. ప్రతి క్రీడాకారుడికి ఒక‌రోజు ఉంటుంది. ఈరోజు అర్షద్ నదీమ్ డే.. అర్షద్ స్వర్ణం సాధించగలిగాడు.. రెండో ఒలింపిక్స్‌లో జావెలిన్‌లో పతకం సాధించగలిగాం.. ఇది చాలా సంతోషకరమైన విషయమన్నారు.


Updated On 9 Aug 2024 7:58 AM GMT
Sreedhar Rao

Sreedhar Rao

Next Story