వివక్ష అనేది చాలా భయంకరమైన రోగం. ఎదుటివారిని తక్కువగా చూసే జాడ్యం చాలా మందిలో ఉంది. డెలివరీ ఏజెంట్లు అంటే చాలా మంది చులకన భావం.

వివక్ష అనేది చాలా భయంకరమైన రోగం. ఎదుటివారిని తక్కువగా చూసే జాడ్యం చాలా మందిలో ఉంది. డెలివరీ ఏజెంట్లు అంటే చాలా మంది చులకన భావం. తమ డెలివరీ ఏజెంట్లు విధులలో ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంంటున్నారు ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకున్నారు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్. తన భార్య గ్రేసియా మునోజ్(Gracia Munoz)తో కలిసి డెలివరీ బాయ్ ఏజెంట్‌గా మారారు. ఓ మాల్‌లో ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకునేందుకు వెళ్లినప్పుడు ఆయనకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకోవడానికి ఓ మాల్‌లోకి వెళ్లినప్పుడు లిఫ్ట్ కాకుండా మెట్లు ఎక్కమని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది సూచించారట! 'డెలివరీ బాయ్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో నాకొక విషయం అర్థమైంది. మేము గురుగ్రామ్( Gurugram)లోని ఒక మాల్‌లో హల్దీరామ్స్ నుంచి ఆర్డర్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్లాము. మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా మమ్మల్ని వేరే ఎంట్రన్స్ వెళ్లమన్నారు. అక్కడ ఎలాంటి ఎలివేటర్లు లేవు. అదే విషయాన్ని నిర్ధారించుకోవడానికి మరోసారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్లాను. లిఫ్ట్‌కు అనుమతి లేదన్నారు. మూడు అంతస్తులు మెట్లెక్కి వెళ్లాను. ఆర్డర్ కలెక్ట్ చేసుకునేప్పుడు కూడా మెట్ల ద్వారం దగ్గరే ఎదురుచూడాల్సిన పరిస్థితి. పని సమయంలో డెలివరీ పార్టనర్ల పరిస్థితులు మెరుగుపర్చడం కోసం మాల్స్ యాజమాన్యంతో మరింత కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నాను. మాల్స్ కూడా వారిపై మానవీయ దృక్పథంతో వ్యవహరించాలి' అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు దీపిందర్ గోయల్( Deepinder Goyal ). తర్వాత ఇతర ఏజెంట్లతో కాసేపు మాట్లాడానని , వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నానని తెలిపారు. దీపిందర్ గోయల్ పోస్ట్‌కు చాలా మంది నెటిజన్లు రియాక్టయ్యారు. మాల్స్ దగ్గరే కాదని, కొన్ని కమ్యూనిటీలో కూడా మెయిన్ లిఫ్ట్ వాడేందుకు డెలివరీ ఏజెంట్లను అనుమతించరని చెప్పారు. అందరిలాగే వారు కూడా లిఫ్ట్ ఉపయోంచేలా చూడాలని, ఇందులో వివక్ష ఉండకూడదని చాలా మంది తెలిపారు. లాస్ట్ వీక్ కూడా గోయల్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. గురుగ్రామ్ వీధుల్లో ఆర్డర్లు డెలివరీ చేస్తూ తన రైడ్‌ను ఎంజాయ్ చేశారు. వినియోగదారులకు ఫుడ్ డెలివరీ చేయడాన్ని ఇష్టపడతానన్నారు. తన భార్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నారు.
