జికా వైరస్(Zika virus) మళ్లీ గజగజమని వణికిస్తోంది. మహారాష్ట్రలోని(Maharashtra) పూణెలో(Pune) ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయి.
జికా వైరస్(Zika virus) మళ్లీ గజగజమని వణికిస్తోంది. మహారాష్ట్రలోని(Maharashtra) పూణెలో(Pune) ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భవతులు(Pregnant women) కూడా ఉన్నారు. జికా వైరస్ వెలుగులోకి రావడమే ఆలసయం రాష్ట్ర ఆరోగ్య విభాగం అప్రమత్తమయ్యంది. జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు మున్సిపల్ అధికారులు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు. అరంద్వానేలో మొదటి కేసు నమోదయ్యిందని ఆరోగ్య శాఖ చెబుతోంది. 46 ఏళ్ల డాక్టర్ మొదట జికా వైరస్ బారిన పడ్డారు. తర్వాత అతని 15 ఏళ్ల కూతురుకు కూడా జికా వైరస్ సోకినట్టు వైద్య పరీక్షలో తేలింది. ఈ ఇద్దరితో పాటు ముండ్వాకు చెందిన మరో ఇద్దరి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు అంటున్నారు. ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల జికా వైరస్ సోకుతుంది. ఈ వైరస్‌ను మొదటిసారిగా 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతోసహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ వైరస్ సోకితే ప్రాణాపాయం ఉండదు కానీ జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.పుణెలో కలకలం సృష్టిస్తోన్న జికా వైరస్..