యువరాజ్ సింగ్ ఫౌండేషన్(Yuvraj Singh Foundation) 17 రాష్ట్రాలలో రొమ్ము క్యాన్సర్(Breast cancer) అవగాహన శిబిరాలను నిర్వహిస్తోంది.
యువరాజ్ సింగ్ ఫౌండేషన్(Yuvraj Singh Foundation) 17 రాష్ట్రాలలో రొమ్ము క్యాన్సర్(Breast cancer) అవగాహన శిబిరాలను నిర్వహిస్తోంది. "నెలకు ఒకసారి మీ నారింజలను(Oranges) తనిఖీ చేసుకోండి" అని YouWeCan ఫౌండేషన్ ప్రకటన వివాదానికి తెరలేపింది. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడ కోసం ఇలాంటి ప్రచారాన్ని ప్రారంభించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై వివిధ రకాలుగా ప్రచారం నిర్వహిస్తోంది. అయితే యువరాజ్ సింగ్(Yuvaraj singh) ఆలోచన మంచిదే అయినప్పటికీ.. అతని సంస్థ చేస్తోన్న ప్రచారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టర్‌లో ఒక యువతి రెండు నారింజ పండ్లను పట్టుకుని బస్సులో నిలబడి ఉండగా, పలువురు వృద్ధ మహిళలు కూర్చొని ఉన్నారు. వృద్ధ మహిళల్లో ఒకరు తన వద్ద నారింజ పండ్ల పెట్టె ఉంది.
ఢిల్లీ మెట్రో(Delhi metro) కోచ్‌లో అతికించిన ఫోటోను ఒక వినియోగదారు షేర్ చేశారు. యువరాజ్ సింగ్ సంస్థతో పాటు ఢిల్లీ మెట్రో కూడా చిత్రాలు మరియు పదాల ఎంపిక సరిగా లేదని ఆరోపించారు. "రొమ్ములు అని కూడా పిలవలేకపోతే ఒక దేశం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎలా అవగాహన కల్పిస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ మెట్రోలో ఇది చూశారా.. ఈ ప్రచారాన్ని ఎలా ఆమోదిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రొమ్ములను నారింజ పండ్లతో పోల్చడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని యువరాజ్ సింగ్‌ను కోరారు. ఢిల్లీ మెట్రో అధికారులు కూడా మెట్రో నుంచి ఈ ప్రకటనను తొలగించాలని వినియోగదారు డిమాండ్ చేశారు.