కడపలో(Kadapa) విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కడప లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌ పార్టీ(congress) తరఫున పోటీ చేస్తున్న వై.ఎస్‌.షర్మిలకు(YS sharmila) అనూహ్యంగా మద్దతు పెరుగుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ(Rahul gandhi) కడప పర్యటన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇడుపులపాయను(Idupulapaya) రాహుల్ సందర్శించడం కూడా షర్మిలకు అనుకూలంగా మారింది.

కడపలో(Kadapa) విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కడప లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌ పార్టీ(congress) తరఫున పోటీ చేస్తున్న వై.ఎస్‌.షర్మిలకు(YS sharmila) అనూహ్యంగా మద్దతు పెరుగుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ(Rahul gandhi) కడప పర్యటన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇడుపులపాయను(Idupulapaya) రాహుల్ సందర్శించడం కూడా షర్మిలకు అనుకూలంగా మారింది. రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత మైనారిటీ వర్గాలు మొత్తం కాంగ్రెస్‌ పార్టీవైపుకు మారిపోయాయి. ఇక బ్రదర్‌ అనిల్‌కుమార్‌(Brother Anil kumar) ఎన్నికల ప్రచారం(Election Campaign) కూడా షర్మిలకు కలిసివచ్చింది. క్రిస్టియన్‌ వర్గమంతా షర్మిల వెంట నడుస్తోంది. క్రిస్టియన్‌ కమ్యూనిటీ ఓట్లన్నీ షర్మిలకు పడుతున్నాయని పోలింగ్‌ సరళి చెబుతోంది. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, వై.ఎస్‌.వివేకానందరెడ్డి అభిమానులు కూడా షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారు. క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. కడప అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) పార్టీకి ఓటు వేసిన వారు లోక్‌సభకు వచ్చేసరికి షర్మిలకు ఓటు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశంపార్టీ(TDP) కార్యకర్తలు కూడా బాహాటంగా షర్మిలకు మద్దతు ఇస్తున్నారు. ఎలాగూ గెలిచే అవకాశం లేదు కాబట్టి షర్మిలకు ఓటు వేద్దామని టీడీపీ క్యాడర్‌ నిర్ణయించుకున్నదట! మొత్తంగా చూస్తే కడప లోక్‌సభలో అసలేమాత్రం ప్రభావం చూపరని అనుకున్న షర్మిల ఇప్పుడు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.

Updated On 21 May 2024 1:48 AM GMT
Ehatv

Ehatv

Next Story