అతిలోక సుందరి శ్రీదేవి ఊహించని విధంగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషయంపై కొందరు గతంలో సందేహాలను వ్యక్తం చేశారు. అయితే ఒక యూట్యూబర్ మాత్రం ఏకంగా సొంతంగా విచారణ జరిపానని సంచలన ప్రకటన చేసింది. నటి శ్రీదేవి మృతికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా ప్రముఖుల లేఖలను యూట్యూబ్ వీడియోలో ఉదహరించినందుకు గానూ సీబీఐ ఆమెపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. గత ఏడాది, ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ […]
అతిలోక సుందరి శ్రీదేవి ఊహించని విధంగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషయంపై కొందరు గతంలో సందేహాలను వ్యక్తం చేశారు. అయితే ఒక యూట్యూబర్ మాత్రం ఏకంగా సొంతంగా విచారణ జరిపానని సంచలన ప్రకటన చేసింది. నటి శ్రీదేవి మృతికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా ప్రముఖుల లేఖలను యూట్యూబ్ వీడియోలో ఉదహరించినందుకు గానూ సీబీఐ ఆమెపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. గత ఏడాది, ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా ఫిర్యాదు మేరకు భువనేశ్వర్‌లోని దీప్తి ఆర్ పిన్నిటి, ఆమె భర్త, న్యాయవాది అయిన సురేష్ కామత్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది, దీనిని ప్రధానమంత్రి కార్యాలయం ఏజెన్సీకి పంపింది. శ్రీదేవి మరణంపై తాను సొంతంగా విచారణ జరిపానని, యూఏఈ-భారత్ ప్రభుత్వాలు నిజాలను దాచినట్టు తేలిందంటూ నకిలీ పత్రాలు సృష్టించిన దీప్తి పిన్నిటిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది.
దీనిపై స్పందించిన దీప్తి. తన వాంగ్మూలం నమోదు చేయకుండానే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమని అన్నారు. శ్రీదేవి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దీప్తి చర్చలు జరిపారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి మరణంపై దీప్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఏఈ-భారత్ ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేఖలతో పాటు సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్ల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి ఇవే సాక్ష్యాలు అంటూ ప్రదర్శించారు. రంగంలోకి దిగిన సీబీఐ దీప్తి చూపిన లేఖలు నకిలీవని తేల్చింది. ఇవన్నీ నకిలీ పత్రాలంటూ ముంబైకి చాందినీ షా అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. శ్రీదేవి ఫిబ్రవరి 2018లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో మరణించారు. శ్రీదేవి మరణానికి సంబంధించి దీప్తి సంచలనాత్మక వాదనలు పలు సందర్భాల్లో వినిపించింది.