యువతకు రీల్స్(Reels) పిచ్చి పట్టుకుంది. రీల్ వీడియో చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటుగా మారింది. కొందరికి అది వ్యసనం అయ్యింది. లైక్‌ల కోసం కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు యువకులు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బాంద్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల శివం అనే కుర్రవాడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్(Instargeam reel) కోసం పెద్ద స్టంటే చేశాడు.

Uttar Pradesh
యువతకు రీల్స్(Reels) పిచ్చి పట్టుకుంది. రీల్ వీడియో చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటుగా మారింది. కొందరికి అది వ్యసనం అయ్యింది. లైక్‌ల కోసం కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు యువకులు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బాంద్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల శివం అనే కుర్రవాడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్(Instargeam reel) కోసం పెద్ద స్టంటే చేశాడు. స్కూల్ టెర్రస్‌పై తలకిందులుగా వేలాడుతూ చేతిలో ఇటుకలు ఉంచుకుని కసరత్తులు చేశాడు. ఉన్నట్టుండి స్కూల్ స్లాబ్ ఊడిపోయింది. పై నుంచి శివం కిందపడ్డాడు. అతడిపై స్లాబ్ శిథిలాలు పడ్డాయి. దాంతో శివం అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు స్కూల్ దగ్గరకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. ఈ రీల్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి పిచ్చి పిచ్చి స్టంట్లు చేస్తూ ప్రాణాలుపోగొట్టుకోవద్దని యువతకు నెటిజన్లు సూచిస్తున్నారు.
