పాత కాలంలో పెళ్లిళ్లు(Marriage) పదుల వయసులోనే జరిగేవి. రానురాను ఆ వయసు కాస్త 20 నుంచి 25 ఏళ్లకు వచ్చింది. కానీ ఇప్పుడు అది 30 దాటిపోయింది. లైఫ్‌లో సెటిల్‌కావాలి, ఆర్థికంగా(Financial) స్థిరపడాలి, బ్యాంక్ బ్యాలెన్స్(Bank Balance) మెయింటెయిన్ చేయాలని ఈ కాలం యువత కోరుకుంటున్నారు. అంతా బాగుందనుకుంటే 30 ఏళ్ల తర్వాతే పెళ్లికి మొగ్గు చూపుతున్నారు. అమ్మాయిలు కూడా ఇప్పుడు దాదాపు 30 ఏళ్లు వచ్చాకే పెళ్లి చేసుకుంటున్నారు. 30 ఏళ్లకు పెళ్లి అయితే యువతీ, యువకులు ఎలా ఆలోచిస్తారో చూద్దాం.

30 ఏళ్లకు పెళ్లి చేసుకోవడంతో జీవితంపై పూర్తి అవగాహన వస్తుందట. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపును కూడా తెచ్చుకుంటున్నారు ఈ కాలం యువత. ఉద్యోగ, ఆర్థిక పరంగా స్థిరపడి పెళ్లి చేసుకోవడంతో భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రావని ఆలోచిస్తున్నారు. సాధారణంగా 20-25 మధ్య కాలంలో పెళ్లి జరిగితే కొంచెం అన్ మెచ్యూర్డ్‌గా(Unmatured) ఆలోచిస్తారు. కానీ 30 ఏళ్ల దాటితే అప్పటికే తనకున్న ఫ్రెండ్స్, తన లైఫ్‌లో కొందరిని చూసి స్ఫూర్తి పొందుతారట. సమాజస్పృహ కూడా ఎక్కువగా ఉంటుందట. 30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంటే జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు. జీవితంలో సమర్థవంతంగా కొన్ని ఆటుపోట్లను ఎదుర్కోవడం వల్ల పరిపక్వతతో ఆలోచిస్తారు. గతం, వర్తమానం, భవిష్యత్‌ను బేరీజు వేసుకొని అడుగులు వేస్తారు. కెరీర్, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తారు. పిల్లల విషయానికొస్తే 30 దాటాక శరీరంలో మార్పులు వస్తాయని, గర్భం రావడం కష్టమంటున్నారు వైద్యులు. హెల్తీ బేబీలకు జన్మనివ్వాలంటే 30లోపే పెళ్లి చేసుకోవాలని వైద్య నిపుణులు చెప్పడం మనకు తెల్సిందే. ప్రేమ విషయంలోనూ 30 దాటాక స్పష్టమైన అభిప్రాయాలు ఉంటాయట. చిన్నవయసులో ప్రేమలు, పెళ్లిల్లు, మళ్లీ విడాకులు చూస్తుంటాం. కానీ 30 దాటిన తర్వాత ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్(Understanding) వచ్చి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ పెరిగి అటు కుటుంబాన్ని, ఇటు భార్యను, సొసైటీని జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ చేస్తారని భావిస్తున్నారు కొందరు.