ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఎండాకాలం సీజన్ కావడంతో ఖర్బూజ(Muskmelon), పుచ్చకాయ(Watermelon) పంటల సాగుపై దృష్టిపెట్టాడు. ఓ చిన్న ఆలోచనతో కేవలం నాలుగు నెలల వ్యవధిలో 3 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడు. వ్యవసాయాన్ని సాంప్రదాయ పద్ధతిలో కాకుండా నూతన ఆవిష్కరణలతో పరుగులు పెట్టించాడు.
ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఎండాకాలం సీజన్ కావడంతో ఖర్బూజ(Muskmelon), పుచ్చకాయ(Watermelon) పంటల సాగుపై దృష్టిపెట్టాడు. ఓ చిన్న ఆలోచనతో కేవలం నాలుగు నెలల వ్యవధిలో 3 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడు. వ్యవసాయాన్ని సాంప్రదాయ పద్ధతిలో కాకుండా నూతన ఆవిష్కరణలతో పరుగులు పెట్టించాడు.
వేసవి కాలం ఖర్బూజ, పుచ్చకాయలకు వచ్చే డిమాండ్ గురించి మనకు తెలియంది కాదు. దీంతో ఈ పంటల వైపు మొగ్గు చూపాడు ఉత్తర ప్రదేశ్‌కుచెందిన(Uttar Pradesh) ఓ రైతు. రెండేళ్లుగా ఖర్బూజ సాగుచేస్తున్నాడు. అయితే ఈ ఏడాది మరింత పొలం కౌలుకు తీసుకుని ఈ పంటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ పువాయాన్ తహసీల్‌కు చెందిన రైతు దీపక్ తను ఉండే ప్రాంతంలోనే ఇతర రైతుల నుంచి కౌలుకు భూములను కౌలుకు తీసుకున్నాడు. సాధారణంగా ఇక్కడ రైతులకు ఆలుగడ్డలను పంటను పండిస్తారు. తర్వాత భూములను ఖాళీగా ఉంచుతారు. దీంతో ఆ భూములను కౌలుకు తీసుకుని సాగు చేయాలనుకున్నాడు దీపక్. ఒక్కో ఎకరానికి దాదాపూ రూ.25 వేల చొప్పున కౌలుకు తీసుకున్నాడు. అలా దాదాపు 350 ఎకరాలను కౌలుకు తీసుకుని ఖర్బూజ, పుచ్చకాయ పంటలను పండించాడు. తొలుత 10 ఎకరాల్లోనే సాగు చేసేవాడు. దీంతో గత రెండేళ్లుగా లాభాలను కళ్లారా చూడడంతో ఈ సారి దాదాపు 350 ఎకరాల్లో పంట పండించాడు. థాయ్‌లాండ్, తైవాన్ నుంచి నాణ్యమైన విత్తనాలను దిగుమతి చేసుకున్నాడు. వీటి ధర కిలోకు రూ.30-90 వేలు ఉంటుంది. విత్తనాల ధర ఎక్కువైనప్పటికి.. పంట దిగుబడి అధికంగా వచ్చింది. ఖర్బూజ పంట అయితే ఎకరానికి 150-200 క్వింటాళ్లు దిగబడి వచ్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్‌లో ఉన్న అనేక మండీలకు తన పంటను సరఫరా చేశాడు. కొందరు నేరుగా దీపక్ దగ్గరికి వెళ్లి ఆర్డర్లు ఇచ్చి మరీ తీసుకెళ్లేవారు. దీంతో ఈ ఒక్క సీజన్‌లోనే దాదాపు అన్ని ఖర్చులు పోను రూ.3 కోట్లు సంపాదించాడట. రోజూ దాదాపు 400-500 మంది కూలీలకు ఇక్కడ ఉపాధి దొరికేది. వేసవిలో ఇలాంటి పంటలను పండిస్తే మంచి ఆదాయం సంపాదించవచ్చని దీపక్ చెప్తున్నాడు.