బెంగళూరులోని(Bangalore) సంపెగహళ్లి(Sampegahalli) ప్రాంతానికి చెందిన యోగేశ్‌(Yogesh)(24), మురళి(Murali) ఇద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌. పాతికేళ్ల మురళీ స్థానిక వాషింగ్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. మురళీ దగ్గరకు వెళ్లిన యోగేశ్‌ తన బైక్‌ను సర్వీసింగ్‌ చేయామని కోరాడు. తర్వాత ఇద్దరూ అక్కడున్న ఎయిర్‌ బ్లోయర్‌తో సరదాగా ఆడుకున్నారు.

బెంగళూరులోని(Bangalore) సంపెగహళ్లి(Sampegahalli) ప్రాంతానికి చెందిన యోగేశ్‌(Yogesh)(24), మురళి(Murali) ఇద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌. పాతికేళ్ల మురళీ స్థానిక వాషింగ్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. మురళీ దగ్గరకు వెళ్లిన యోగేశ్‌ తన బైక్‌ను సర్వీసింగ్‌ చేయామని కోరాడు. తర్వాత ఇద్దరూ అక్కడున్న ఎయిర్‌ బ్లోయర్‌తో సరదాగా ఆడుకున్నారు. మొదట మురళి ఎయిర్‌ బ్లోయర్‌తో యోగేశ్‌ మొహంపై గాలి కొట్టాడు. అతడు దాన్నుంచి తప్పించుకున్నాడు. తర్వాత అతడిని పట్టుకుని ఎయిర్‌ బ్లో నాజిల్‌ను అతడి మర్మాంగంలోకి చొప్పించి దానిని ఆన్‌ చేశాడు మురళి. దాంతో యోగేశ్‌ పొట్ట ఉబ్బిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలను నిర్వహించిన డాక్టర్లు గాలి ఒత్తిడి కారణగా అవయవాల లోపలి భాగాలు దెబ్బతిన్నాయని గుర్తించారు. వెంటనే సర్జరీ మొదలు పెట్టారు. చికిత్స చేసినప్పటికీ యోగేశ్‌ ప్రాణాలు నిలవలేదు. మరళిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated On 29 March 2024 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story