తెలంగాణ(Telangana) పై కాంగ్రెస్‌(Congress) అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో కాంగ్రెస్‌ పెద్దల్లో కొత్త ఉత్సాహం వస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు కాస్త ముందుగా వస్తున్న ఎన్నికలు కావడంతో వీటిపై మరింత ఫోకస్‌ పెట్టింది.

తెలంగాణ(Telangana) పై కాంగ్రెస్‌(Congress) అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో కాంగ్రెస్‌ పెద్దల్లో కొత్త ఉత్సాహం వస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు కాస్త ముందుగా వస్తున్న ఎన్నికలు కావడంతో వీటిపై మరింత ఫోకస్‌ పెట్టింది. తెలంగాణలో విజయం సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ శ్రేణులలో సమరోత్సాహాన్ని ప్రోది చేయాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. మొదటి లిస్ట్, రెండో లిస్ట్‌, మూడో లిస్ట్‌ అంటూ కాలయాపన చేయకుండా ఒకేసారి 90 నుంచి వంద మంది అభ్యర్థులను ప్రకటించాలని అనుకుంటోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. రెండో వారంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల లిస్ట్ రాబోతున్నది. మూడో వారం నుంచి కాంగ్రెస్‌ బస్సు యాత్ర(Bus Travel) నిర్వహించబోతున్నది. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకులు పాల్గొంటారు. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారిగా బస్సు యాత్ర ఉండబోతున్నది. బస్సు యాత్రను ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) ప్రారంభించబోతున్నారన్నది సమాచారం. ఆమె కూడా బస్సు యాత్రలో పాలుపంచుకోబోతున్నారట! ప్రియాంకగాంధీ బస్సు యాత్ర వల్ల కాంగ్రెస్‌కు వచ్చే అడ్వాంటేజ్‌ ఏమిటో ఈ వీడియోలో చూద్దాం.

Updated On 9 Oct 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story