Vizag Steel Plant Privatization : విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందా..?
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని(Vizag Steel Factory) ప్రైవేటుపరం(Privatization) చేయనున్నారనే వార్త సహజంగానే తెలుగువారికి ఆందోళన కలిగించింది. ప్రైవేటుపరం చేయవద్దంటూ ఆందోళనలు జరిగాయి. అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు నిలిచిపోయిందా? కేంద్ర ప్రభుత్వం తన ఆలోచన మార్చుకుందా?
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని(Vizag Steel Factory) ప్రైవేటుపరం(Privatization) చేయనున్నారనే వార్త సహజంగానే తెలుగువారికి ఆందోళన కలిగించింది. ప్రైవేటుపరం చేయవద్దంటూ ఆందోళనలు జరిగాయి. అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు నిలిచిపోయిందా? కేంద్ర ప్రభుత్వం తన ఆలోచన మార్చుకుందా? అంటే అవుననే అంటున్నారు భారతీయ జనతా పార్టీ(BJP) ఎంపీ జీవీఎల్ నరసింహారావు(MP GVL Narasimha Rao). స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని రాజకీయపార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గతంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నారు. లాభాలలో నడుస్తున్న కర్మాగారం ఇది! లాభాల్లో ఉన్న ఈ ఫ్యాక్టరీని ఎందుకు ప్రైవేటుపరం చేస్తున్నారో చెప్పాలని రాజకీయపార్టీలు, ప్రజలు, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాయి. కేంద్రం మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోలేదు. ప్రైవేటీకరణకే మొగ్గు చూపించింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసుకుంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఓ సంచలన వ్యాఖ్య చేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలిచిపోయిందని, లాభాలలో నడించేందుకు కావాల్సిన వనరులను సమకూరుస్తున్నదని చెప్పారు.జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థమేమిటో తెలుసుకుందాం!