తమిళనాడు(Tamilnadu) రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌డిఎ(NDA) కూటమి నుంచి అన్నా డీఎంకే(AIADMK) వైదొలిగింది. బీజేపీ(BJP) రాష్ట్ర నాయకత్వం తమ పార్టీ నేతలపై పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నా డీఎంకే అంటోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం తాము సిద్ధంగా ఉన్నామని, అన్నా డీఎంకే కొత్త కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళుతుందని ఆ పార్టీ డిప్యూటీ కో ఆర్డినేటర్‌ కేపీ మునుస్వామి తెలిపారు.

తమిళనాడు(Tamilnadu) రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌డిఎ(NDA) కూటమి నుంచి అన్నా డీఎంకే(AIADMK) వైదొలిగింది. బీజేపీ(BJP) రాష్ట్ర నాయకత్వం తమ పార్టీ నేతలపై పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నా డీఎంకే అంటోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం తాము సిద్ధంగా ఉన్నామని, అన్నా డీఎంకే కొత్త కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళుతుందని ఆ పార్టీ డిప్యూటీ కో ఆర్డినేటర్‌ కేపీ మునుస్వామి తెలిపారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దివంగత ముఖ్యమంత్రి జయలలితను(Jayalalitha) విమర్శించినప్పుడే అన్నా డీఎంకే అభ్యంతరాలు చెప్పింది. పైగా ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి జాబితాను విడుదల చేస్తానని అన్నామలై చెప్పడం, దివంగత ముఖ్యమంత్రి అన్నాదురైపై కూడా అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అన్నా డీఎంకేకు అసలు నచ్చలేదు. అందుకే ఎన్‌డిఎ కూటమి నుంచి వైదొలిగింది. ఎన్‌డిఎతో తెగదెంపులు చేసుకోవడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. అదేమిటో తెలుసుకుందాం!

Updated On 26 Sep 2023 2:42 AM GMT
Ehatv

Ehatv

Next Story