వాయు కాలుష్యం(air pollution) వల్ల సంభవిస్తున్న మరణాలపై(Death) ప్రముఖ వైద్య పరిశోధన పత్రిక లాన్సెట్‌లో ఓ నివేదికను ప్రచురించింది.
వాయు కాలుష్యం(air pollution) వల్ల సంభవిస్తున్న మరణాలపై(Death) ప్రముఖ వైద్య పరిశోధన పత్రిక లాన్సెట్‌లో ఓ నివేదికను ప్రచురించింది. దీని నివేదిక ప్రకారం దేశంలోని 10 నగరాల్లో ఏటా 33 వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. మన దేశ రాజధాని ఢిల్లీలో అయితే అత్యధికంగా 12 వేల మరణాలు అంటే మొత్తం మరణాల్లో 11.5శాతం మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ పత్రిక అంచనా వేసింది.
భారత్‌లోని ఢిల్లీ(delhi), చెన్నై, అహ్మదాబాద్(ahmedabad), కోల్‌కతా(Kolkata), హైదరాబాద్(Hyderabad), ముంబై(Mumbai), పుణె(Pune), సిమ్మా, వారణాసిలో ఈ పరిశోధనలు జరిపారు. దేశవ్యాప్తంగా ఏటా ఈ నగరాల్లో 33 వేల మరణాలు వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని అంచనా వేసింది. ఈ పది నగరాల్లో మొత్తం మరణాల్లో 7.2 శాతం వాయు కాలుష్యం వల్లే అని తేల్చారు. అత్యల్పంగా అయితే సిమ్లాలో 59 మంది మరణించగా మొత్తంగా మరణాల్లో ఇది 3.7 శాతంగా ఉంది. విదేశీ పరిశోధకులు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ పది నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులు 2.5 కాలుష్య రేణువుల స్థాయిని మించిపోయాయని తెలిపారు. ఏడాదిలో 99.8 శాతం రోజులు ఇదే పరిస్థితి నెలకొని ఉందని తెలిపింది. 2008 నుంచి 2019 వరకు పది పెద్ద నగరాల్లో మరణాల సమచారాన్ని సేకరించి అధ్యయనం చేశారు. కొన్ని నగరాల్లో మూడు నుంచి ఏడేళ్ల వరకు సంభవించిన డేటా మాత్రమే లభించింది. మొత్తం 36 లక్షల మరణాలను పరిశోధించరు. అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి పీఎం 2.5 రేణువుల స్థాయిలపై అంచనాలు రూపొందించారు.
దేశంలోని పలు నగరాల్లో కాలుష్య ప్రభావాన్ని అధ్యయనం చేయడం భారత్‌లో ఇదే తొలిసారని తెలిపారు. ఇంకా ఈ అధ్యయనంలో వాయు కాలుష్యం, నగరాల జనాభాపై దాని ప్రభావం వంటి కీలక విషయాలు వెల్లడించారు.