రేపట్నుంచి పార్లమెంట్‌ వర్షాకాల బడ్జెట్‌ సమావేశాలు(Parliament Sessions) మొదలవుతున్నాయి.

రేపట్నుంచి పార్లమెంట్‌ వర్షాకాల బడ్జెట్‌ సమావేశాలు(Parliament Sessions) మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని(All Party Conference) ఏర్పాటు చేశారు. ఇందులో వైసీపీ(YCP) తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి(MP Vijaysai reddy), మిథున్‌రెడ్డి(Mithun Reddy) హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా(AP special Status) ఇవ్వాలని వైసీపీ డిమాండ్‌చేసింది. మరోవైపు బీహార్‌కు(Bihar) ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ(JDU) డిమాండ్‌ చేసింది. తెలుగుదేశంపార్టీ(TDP) మాత్రం గమ్మున ఉండిపోయింది. ఈ సమావేశంలోనే ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ తెలిపింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. అఖిల పక్ష సమావేశం తర్వాత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో 45 రోజుల్లో 39 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయన్నారు. ఢిల్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ దాడులను ఎండగడతామన్నారు. ఢిల్లీలో బుధవారం వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. బ్లాక్‌ మెయిల్‌ చేసే మీడియాను అడ్డుకునే చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story