టీడీపీ(TDP) అధినేత‌ చంద్రబాబు(Chandrababu) స్కిల్ స్కామ్‌లో(Skill dvelopment case) అరెస్టై ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న‌ను వ‌రుస‌ కేసులు వెంటాడుతున్నాయి. గతంలో తెలంగాణలో నమోదైన ఓటుకు నోటు కేసు(Money For vote) అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.

టీడీపీ(TDP) అధినేత‌ చంద్రబాబు(Chandrababu) స్కిల్ స్కామ్‌లో(Skill development case) అరెస్టై ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న‌ను వ‌రుస‌ కేసులు వెంటాడుతున్నాయి. గతంలో తెలంగాణలో నమోదైన ఓటుకు నోటు కేసు(Note For vote) అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీకి(YCP) చెందిన మంగళగిరి(Mangalagiri) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(MLA Alla Ramakrishna Reddy) సుప్రీంకోర్టులో(Supreme Court) రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును ద‌ర్యాప్తు చేస్తున్న‌ తెలంగాణ ఏసీబీ(TS ACB) నుంచి.. ఓటుకు నోటు‌ కేసును సీబీఐకి(CBI) బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 4వ తేదీన సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు లిస్టైంది. జస్టిస్ సంజయ్ కుమార్(Justice Sanjay Kumar), జస్టిస్ సుందరేష్(Justice Sundharesh) కూడిన ధర్మాసనం.. ఓటుకు నోటు కేసుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించే అవకాశం ఉంది.

2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల స‌మ‌యంలో బీఆర్ఎస్(BRS) కు చెందిన నామినేటేడ్ ఎమ్మెల్సీని కొనేందుకు ప్ర‌య‌త్నించి టీడీపీ నేత‌లు ఏసీబీకి చిక్కారు. చంద్ర‌బాబు బ్రీప్‌డ్ మీ ఆడియో క్లిప్ సంచ‌ల‌నం రేపింది. అయితే ఈ కేసు విషయమై 2021 మే 27న ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ లో చంద్రబాబు పేరు లేదు. తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డంతో ఏం జ‌రుగ‌నుంద‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది.

Updated On 1 Oct 2023 5:09 AM GMT
Ehatv

Ehatv

Next Story