ఏపీలో ఎన్నికలు(AP Elections) సమీపిస్తున్న వేల వైసీపీ అధినేత జగన్(Jagan)..ముందస్తు కసరత్తు మొదలుపెట్టారు. అసెంబ్లీ సీట్లతోపాటు ఎంపీ స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. పార్లమెంటు సీట్లలో ప్రతిపక్షాలపై గత ఎన్నికల తరహాలో పైచేయి సాధించాలన్నదే వైసీపీ(YCP) అధినేత జగన్ టార్గెట్ గా కనిపిస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ(TDP)-జనసేన(Janasena) కలిసి పోటీ చేస్తుండటంతో జగన్ మరింత వ్యూహాత్మకంగా ఎంపీ అభ్యర్థులను బరిలోకి దింపాల్సి వస్తోంది.

ఏపీలో ఎన్నికలు(AP Elections) సమీపిస్తున్న వేల వైసీపీ అధినేత జగన్(Jagan)..ముందస్తు కసరత్తు మొదలుపెట్టారు. అసెంబ్లీ సీట్లతోపాటు ఎంపీ స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. పార్లమెంటు సీట్లలో ప్రతిపక్షాలపై గత ఎన్నికల తరహాలో పైచేయి సాధించాలన్నదే వైసీపీ(YCP) అధినేత జగన్ టార్గెట్ గా కనిపిస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ(TDP)-జనసేన(Janasena) కలిసి పోటీ చేస్తుండటంతో జగన్ మరింత వ్యూహాత్మకంగా ఎంపీ అభ్యర్థులను బరిలోకి దింపాల్సి వస్తోంది.

ఏపీలో ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ఈసారి ఏపీలో ప్రతిపక్షం బలం భారీగా పెరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల జగన్ పార్టీ ఊహించని విధంగా 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలను గెలుచు కుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వైసీపీ అధినేత, సీఎం జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కొని మరోసారి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలన్నది వైసీపీ అధినేత లక్ష్యం. అందులో భాగంగానే ప్రతిపక్షం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఊహించని అభ్యర్థులను తెరమీదకు తెచ్చే ప్రణాళికలు జగన్ వేసుకున్నారని చెబుతున్నారు.

ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, ప్రజల్లో వారికి ఉన్న సానుకూలత బట్టే సిట్టింగ్ లను కొనసాగిస్తున్నారు. ఏ మాత్రం వ్యతిరేకత కనిపించినా..నిర్మోహమాటంగా అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీకి చెందిన ప్రస్తుత ఎంపీలను కొందరిని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి, కొందరు సీనియర్లను లోక్ సభకు(Lok Sabha) పంపాలని సీఎం జగన్ దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‎ను నిడుదవోలు ఎమ్మెల్యేగా, రాజమండ్రి ఎంపీగా మంత్రి చెల్లుబోయిన వేణు లేదా మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వంగా గీత మాత్రం ఈసారి కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. చలమల శెట్టి సునీల్ కూడా రంగంలోకి దిగుతున్నారని పార్టీ వర్గాల సమాచారం.

ఇక గుంటూరు, విజయవాడ స్థానాల్లో పార్లమెంటు అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ పెద్ద కసరత్తే చేస్తున్నారట. అమరావతిని(Amaravati) రాజధానిగా కొనసాగించకపోవడంతో ఈ రెండు జిల్లాల్లో వైసీపీపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి చోట సీట్లు గెలవడం చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని. అందుకే బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలన్న ఎత్తుగడలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నర్సరావుపేట నుంచి ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి(Ayodhya Ramireddy) టికెట్ ఇస్తారని అంటున్నారు. ఏలూరు ఎంపీ స్థానంలో కోటగిరి శ్రీధర్(Kotagiri Shridhar) స్థానంలో బోళ్ల రాజీవ్ పేరు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. నరసాపురం నుంచి దివంగత క్రిష్ణంరాజు సతీమణి శ్యామలను పోటీలో నిలిపేందుకు ఇప్పటికే మిథున్ రెడ్డి సంప్రదింపులు చేస్తున్నారు. ఈ స్థానం నుంచి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ రఘురామ కృష్ణంరాజు నిలబడుతున్నారని, ఎలాగైనా ఆయన్ను ఓడించాలన్నది వైసీపీ లక్ష్యంగా చెబుతున్నారు. శ్యామల ఆసక్తిగా లేకపోతే గోకరాజు రామరాజు పేరును జగన్ పరిశీలిస్తున్నారు.

ఒంగోలు నుంచి కరణం బలరాంను హిందూపురం నుంచి ఎమ్మెల్సీ ఇక్బాలు ఎంపీగా పోటీ చేయించే అంశంపైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఎస్ దీపికరెడ్డి పేరు దాదాపు ఖరారైందటున్నారు. అయితే దీపికరెడ్డి.. టీడీపీ తరఫున బరిలో నిలుస్తున్న నందమూరి బాలకృష్ణకు ఎంతమాత్రం పోటీ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. తిరుపతి, కడప, నంద్యాల, రాజంపేట, మచిలీపట్నం ఎంపీల స్థానాల్లో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని పేర్లు పరిశీలిస్తుండగా, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పేరు ఖాయమైందన్నది పార్టీ వర్గాల సమాచారం.

Updated On 14 Dec 2023 6:10 AM GMT
Ehatv

Ehatv

Next Story