రెజ్లర్ల ఆవేదనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భారత రెజ్లింగ్‌ సమాఖ్యను ప్రక్షాళన చేద్దామన్న సోయి లేకుండా పోయింది. అందుకే స్టార్‌ రెజ్లర్లందరూ తమకు తోచిన విధంగా నిరసనలు తెలుపుతున్నారు. వినేశ్‌ ఫోగాట్‌(Vinesh Phogat) కూడా భారత ప్రభుత్వం తనకు ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

రెజ్లర్ల ఆవేదనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భారత రెజ్లింగ్‌ సమాఖ్యను ప్రక్షాళన చేద్దామన్న సోయి లేకుండా పోయింది. అందుకే స్టార్‌ రెజ్లర్లందరూ తమకు తోచిన విధంగా నిరసనలు తెలుపుతున్నారు. వినేశ్‌ ఫోగాట్‌(Vinesh Phogat) కూడా భారత ప్రభుత్వం తనకు ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రోడ్డెక్కి పోరాటాలు చేసినా, ఆందోళనలు చేపట్టినా, క్రీడా శాఖ నుంచి స్పష్టమైన హామీ లభించినా రెజ్లర్లకు మాత్రం న్యాయం జరగలేదని వాపోయారు వినేశ్‌ ఫోగాట్‌. ఇలాంటి పరిస్థితులలో తనకు లభించిన పురస్కారాలను అట్టిపెట్టుకోవడంలో అర్థం లేదని తెలిపారు. తన ఆవేదనను ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలిపారు. 'ఇంత జరిగిన తర్వాత ఇక నా జీవితంలో లభించిన రెండు అవార్డులకు విలువే లేదు. ఎందుకంటే ఏ మహిళ అయినా ఆత్మగౌరవాన్ని కోరుకుంటుంది. నేనూ అంతే.. నా జీవితానికి ఆ అవార్డులు ఇకపై భారం కాకూడదనుకుంటున్నాను. నాకు మీరు ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇస్తున్నాను' అని ప్రధానమంత్రికి రాసిన లేఖలో తెలిపారు. మహిళా సాధికారత, సమ సమానత్వం అనే ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమని తీవ్రంగా ఆరోపించారు ఫోగట్‌. వినేశ్‌ ఫొగాట్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలు సాధించారు.మూడు (2014, 2018, 2022) కామన్వెల్త్‌ క్రీడల్లోనూ చాంపియన్‌గా నిలిచారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం (2018), కాంస్యం (2014) సంపాదించారు. కుస్తీలో ఆమె పతకాల పట్టును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో అర్జున, 2020లో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డులను అందించింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో లైంగిక ఆరోపణల కేసులో నిందితుడైన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ వర్గమే గెలిచింది.ఆయన విధేయుడు సంజయ్‌ సింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో రెజ్లర్‌ సాక్షి మలిక్‌ రెజ్లింగ్‌ నుంచి వైదొలిగారు. రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా, బధిర రెజ్లర్‌ వీరేందర్‌ సింగ్‌ పద్మశ్రీ పురస్కారాలను వెనక్కి ఇచ్చారు. అయితే కేంద్ర క్రీడాశాఖ నియమావళిని అతిక్రమించడంతో డబ్ల్యూఎఫ్‌ఐని సస్పెండ్‌ చేసింది. అయినప్పటికీ వివాదం మాత్రం సద్దుమణగలేదు.

Updated On 27 Dec 2023 12:35 AM GMT
Ehatv

Ehatv

Next Story