మనసు ఒప్పుకోవడం లేదు. వారిద్దరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సాయంత్రం హరిద్వార్‌ వద్ద పవిత్ర గంగా నదిలో వాటిని కలిపేయనున్నాం. ఈ పతకాలే మా ప్రాణం.. ఆత్మ. అందుకే.. వాటిని గంగలో కలిపేశాక ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం’ అని రెజ్లర్‌ బజరంగ్‌ పునియా ఓ ట్వీట్‌ చేశారు.

భారత అగ్రశ్రేణి రెజ్లర్ల(Wrestlers) నిరసన తీవ్ర రూపం దాల్చుతోంది. మొదట్లో శాంతియుతంగానే నిరసన చేపట్టారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. రెజ్లింగ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(WFI) చీఫ్‌, బీజేపీ(BJP) ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు(Brij Bhushan Saran Singh) వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళనను కేంద్రం అసలు పట్టించుకోలేదు. కర్ణాటక ఎన్నికల్లో(Karnataka Elections), పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవ సంబరాలకు ఇచ్చిన ప్రాధాన్యత వీరి ఆందోళనకు ఇవ్వలేదు. తమ విజ్ఞప్తులను ఖాతరు చేయకపోవడంతోనే రెజ్లర్లు ఆదివారం పార్లమెంట్‌ కొత్త భవనం దగ్గరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు రెజ్లర్లు. వారి పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్‌ చేశారు. ఇక నుంచి జంతర్‌మంతర్‌(Jantar Mantar) దగ్గర దీక్షకు అనుమతించబోమని చెప్పేశారు.

మొన్నటి పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. రెజ్లర్లు మంగళవారం కీలక ప్రకటన చేశారు. తాము సాధించిన పతకాలకు ఎలాంటి అర్థం లేకుండా పోయిందని, వాటిని ఇవాళ సాయంత్రం హరిద్వార్‌లోని గంగానదిలో కలిపేస్తామని రెజ్లర్లు ప్రకటించారు. తమ పతకాలను గంగలో విసిరేసి ఇండియా గేట్‌(India Gate) దగ్గర నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవం వేళ తమను లైంగికంగా వేధించిన బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సిం్‌ తెల్లటి దుస్తులను ధరించి ఫోటోలకు పోజులివ్వడం తమను ఎంతగానో కలచివేసిందని రెజ్లర్లు అన్నారు. 'ఆదివారం రోజున జరిగిన పరిణామాలను ప్రతి ఒక్కరూ చూశారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న మాపై పోలీసులు దారణంగా వ్యవహరించారు. పైగా మాపైనే కేసు పెట్టారు. మహిళా రెజ్లర్లు తమకు న్యాయం చేయాలని కోరడం తప్పా? దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకాలు ఎందుకు సాధించామా అని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు ఆ పతకాలకు ఎలాంటి అర్థమూ లేదు. వాటిని తిరిగి ఇవ్వమన్నది మరణంతో సమానం. కానీ ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకడం కష్టం. రాష్ట్రపతి, ప్రధానికి పతకాలను ఇచ్చేద్దామనుకున్నా మనసు రావడం లేదు. వారు మా సమస్యలను పట్టించుకోవడం లేదు. అందుకే సాయంత్రం హరిద్వార్‌ దగ్గర గంగానదిలో వాటిని కలిపేయనున్నాం. ఈ పతకాలే మాకు ప్రాణం. మా ఆత్మ. అందుకే వాటిని గంగలో కలిపి ఇండియా గేట్‌ దగ్గర ఆమరణ నిరాహారదీక్షకు దిగుతాం' అని రెజ్లర్‌ బజరంగ్‌ పునియా(Bajrang Punia) అన్నారు.

మనసు ఒప్పుకోవడం లేదు. వారిద్దరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సాయంత్రం హరిద్వార్‌ వద్ద పవిత్ర గంగా నదిలో వాటిని కలిపేయనున్నాం. ఈ పతకాలే మా ప్రాణం.. ఆత్మ. అందుకే.. వాటిని గంగలో కలిపేశాక ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం’ అని రెజ్లర్‌ బజరంగ్‌ పునియా ఓ ట్వీట్‌ చేశారు.

Updated On 30 May 2023 4:26 AM GMT
Ehatv

Ehatv

Next Story