లోక్‌సభ ఎన్నికల(Lok sabha ELections) మొదటి విడత పోలింగ్(Polling) కొనసాగుతోంది. ఉదయ నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. సాధారణ ప్రజలతో పాటు సినీ నటులు, రాజకీయ నాయకులు, సెలెబ్రిటలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు
లోక్‌సభ ఎన్నికల(Lok sabha ELections) మొదటి విడత పోలింగ్(Polling) కొనసాగుతోంది. ఉదయ నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. సాధారణ ప్రజలతో పాటు సినీ నటులు, రాజకీయ నాయకులు, సెలెబ్రిటలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే (Jyoti Amge) కూడా ఓటు(Vote) హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆమె ఓటు వేశారు. కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన జ్యోతి.. అందరితోపాటుగానే క్యూలైన్‌లో నిల్చుని మరీ ఓటు వేశారు. తర్వాత ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, అది మన కర్తవ్యమని చెప్పారు. దేశ పౌరులుగా అది మన బాధ్యత అని అన్నారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. తాను చదువుకున్న స్కూల్‌లోనే ఓటు వేశానని జ్యోతి ఆమ్గే తెలిపారు.