ఇంట బయట సమర్థవంతంగా భాద్యతలు నెరవేర్చగల స్త్రీలు ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల ఇబ్బందులుని ఎదుర్కొంటున్నారు. స్త్రీలకూ రూపొందించిన ఎన్నో చట్టాలు ,హక్కులు ఉన్నపటికీ ప్రభుత్వం వాటిని అమలు పరిచేవిధనంలో గట్టి చర్యలు చేపట్టటం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో స్త్రీల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి .కానీ చాలమందికి వాటి గురించి పూర్తి అవగాహన ఉండటం లేదు . మాహిళలు అన్ని రంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. సొంతవ్యాపారం చేసుకునే మహిళలకు ,ఎన్నో రకాల పథకాల ద్వారా […]

ఇంట బయట సమర్థవంతంగా భాద్యతలు నెరవేర్చగల స్త్రీలు ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల ఇబ్బందులుని ఎదుర్కొంటున్నారు. స్త్రీలకూ రూపొందించిన ఎన్నో చట్టాలు ,హక్కులు ఉన్నపటికీ ప్రభుత్వం వాటిని అమలు పరిచేవిధనంలో గట్టి చర్యలు చేపట్టటం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో స్త్రీల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి .కానీ చాలమందికి వాటి గురించి పూర్తి అవగాహన ఉండటం లేదు . మాహిళలు అన్ని రంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. సొంతవ్యాపారం చేసుకునే మహిళలకు ,ఎన్నో రకాల పథకాల ద్వారా ఉపాధి ప్రోద్బలం అందిస్తున్నప్పటికీ సరైన అవగాహనా లేక కొన్ని ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు .వీటి పైన అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది . అసలు మహిళల కోసం ఎలాంటి అవకాశాలు పథకాలు అమలులో ఉన్నాయో చూద్దాం .

వ్యాపారంచేసుకునే మహిళలకు ప్రభుత్వం ఇప్ప్పటికే ఎన్నో రకాల ప్రయోజనాలు పథకాల రూపం లో అందజేయిస్తుంది. దీనితో ఇంటిదగ్గర వ్యాపారం చేసుకునేవాళ్ళు ఆర్థిక ప్రోద్బలన్నీ అందించే విధం గా భారతీయ మహిళా బ్యాంకు రుణాల్ని సైతం అందిస్తుంది . ముద్ర ,ముద్ర యోజన వంటి ప్రభుత్వ పథకాల ద్వారా సొంత కంపెనీ లు నిర్వహించే మహిళకు 20 కోట్ల వరకు రుణాలను అందిస్తుంది. స్మాల్ స్కేల్ బిజినెస్ పరిశ్రమలకి కోటి రూపాయల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలని ఇస్తుంది . వడ్డీ రేట్ల విషయం లోకూడా ప్రత్యేక రాయితీని ఇస్తుంది.

ఫుడ్ అండ్ కేటరింగ్ వ్యాపారం చేయాలి అనుకొనే మహిళలకోసం ప్రభుత్వం అన్నపూర్ణ పథకం కిందట 50. వేల రూపాయల వరకు రుణాలని సైతం అందిస్తుంది . TREAD అనే స్కీం ద్వారా మహిళలకు తయారీ,సేవలు వ్యాపారానికి కావాల్సిన రుణం ,శిక్షణ వంటి విషయాల పైన అవగాహన కల్పిస్తారు . అన్నపూర్ణ పథకం లో మహిళలు తమ వ్యాపారానికి కావాల్సిన వంటపాత్రలు ,ఇతర సామాన్లు కొనుగోలు చేయవచ్చు . ఈ రుణాన్ని మూడుఏళ్లలో తిరిగి చెల్లించాలి .

2017 లో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా శక్తి కేంద్రాలు వలన ఉపాధి పథకాలు ,ఉపాధి శిక్షణ వంటివి ఇచ్చి ఉద్యోగాలు కల్పించే విధం గా'ఈ మహిళా శక్తి కేంద్రాలు అనే రూపొందించబడ్డాయి .

ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న మహిళలలకు తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకునే విధానం లో SBI స్త్రీ శక్తి స్కీం కింద 50 లక్షల వరకు రుణాలని అందజేస్తుంది . ఈ పథకం ద్వారా లబ్ది పొందాలి అనుకునేవారికి 5 లక్షల వరకు ఎలాంటి షూరిటీ అవసరం లేదు . వ్యాపారంలో 50% వాటా కలిగి ఉండాలి . దరఖాస్తు చేసుకొనే వాళ్ళ డెబిట్ హిస్టరీ,బిజినెస్ ని బట్టి వడ్డీరేటు ఉంటుంది . నిర్ణీతగడువులో తీసుకున్న మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది .

చిన్న చిన్న వ్యాపారాలను చేయాలనీ యోచనలో ఉండే మహిళలకోసం ఓరియంటల్ బ్యాంకు అఫ్ కామర్స్ ఒక స్కీం ని అందిస్తుంది . ఈ పథకంలో కూడా ఎలాంటి షూరిటీ లేకుండా 25 లక్షల వరకు రుణాన్ని బ్యాంకు ద్వారా పొందే అవకాశాన్ని ఇస్తుంది .

ఇలాంటి మరెన్నో ప్రభుత్వపథకాల ద్వారా ప్రయోజనాలు పొందుతూ సొంత వ్యాపారాలతో ,చిన్న చిన్న పరిశ్రమలతో ,స్వయంఉపాధి తో ఆర్థికంగా పురోగతి సాధించే విధంగా ప్రోత్సహించే విధానాలు ఎన్నో అందుబాటులో ఉన్నపటికీ సరైన అవగాహనా లేక వీటి ప్రయోజనాలు మహిళలు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారు .

Updated On 8 March 2023 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story