సైకిల్ తొక్కడం కూడా తెలియని ఆ మహిళ.. భర్త అనారోగ్యం పాలవడంతో డ్రైవింగ్ నేర్చుకుని ఓలా(Ola)లో పనిచేయడం ప్రారంభించింది.
సైకిల్ తొక్కడం కూడా తెలియని ఆ మహిళ.. భర్త అనారోగ్యం పాలవడంతో డ్రైవింగ్ నేర్చుకుని ఓలా(Ola)లో పనిచేయడం ప్రారంభించింది.
అహ్మదాబాద్(Ahamadabad)కు చెందిన ఓలా డ్రైవర్ అర్చన పాటిల్(Archana Patel), ప్రతికూల పరిస్థితుల వారి కుటుంబానికి అండగా ఉంటూ ఆదర్శప్రాయంగా నిలబడ్డారు. ఒక . ఆమె కృషి, ప్రయత్నాలకు ఆశ్చర్యపోయిన ఓ ప్రయాణీకుడు ఓజాస్ దేశాయ్(Ojas Desai)ఆమె కన్నీటిగాథను తెలుసుకున్నాడు. సైకిల్ తొక్కడం కూడా తెలియని పాటిల్ తన భర్త అనారోగ్యంతో ఆరు నెలల్లో డ్రైవింగ్ నేర్చుకుంటానని సవాల్‌గా తీసుకొని డ్రైవింగ్ నేర్చుకొని ఒడిదుడుకులు ఎదురైనా పట్టుదలతో ఆఖరికి ఆ బాధ్యతలు చేపట్టింది. గుజరాత్(Gujarat)లో డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే చాలా కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరీక్షలన్నీ పాసై ఆమె డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించింది. ఒలా డ్రైవర్‌గా మహిళ రావడంతో ఓ వ్యక్తి ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఓలా లేదా ఉబర్‌లో మహిళా డ్రైవర్‌ను చూడడం ఇదే మొదటిసారి. నా నగరం, సూరత్(Surat)లో, నేను మహిళా ఆటో డ్రైవర్లను చూశాను, కానీ ఓలాలో మహిళా డ్రైవర్ సేవలను ఎప్పుడూ చూడలేదని ఆ వ్యక్తి తెలిపాడు.