మహిళల శరీరాలపై కేరళ హైకోర్టు(Kerala High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఆలోచింపచేసేలా, న్యాయస్థానాల గౌరవాన్ని పెంచేలా ఉన్నాయి. నగ్నత్వానికి, అశ్లీలతకు ఉన్న తేడాను న్యాయస్థానం విడమర్చి చెప్పింది. సామాజిక కార్యకర్త రెహనా ఫాతిమాపై పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల కింద నమోదైన కేసులో విచారణలో భాగంగా కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమెకు ఊరటనిచ్చింది.
మహిళల శరీరాలపై కేరళ హైకోర్టు(Kerala High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఆలోచింపచేసేలా, న్యాయస్థానాల గౌరవాన్ని పెంచేలా ఉన్నాయి. నగ్నత్వానికి, అశ్లీలతకు ఉన్న తేడాను న్యాయస్థానం విడమర్చి చెప్పింది. సామాజిక కార్యకర్త రెహనా ఫాతిమాపై పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల కింద నమోదైన కేసులో విచారణలో భాగంగా కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమెకు ఊరటనిచ్చింది. కొన్నాళ్ల కిందట ఫాతిమా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆమె పడుకుని ఉంది. నడుముపై భాగంలో ఎలాంటి వస్త్రమూ లేదు. ఆమె ఒంటిపై ఆమె కుమారుడు, కూతురు రంగులు వేస్తుంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అమెను కొందరు రకరకాల మాటలన్నారు. పెద్ద ఎత్తున కేసులు కూడా పెట్టారు. కేసుల నుంచి బయటపడేందుకు ఫాతిమా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వ్యవహారం కేరళ హైకోర్టుకు చేరింది. కేసు విచారణలో భాగంగా జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు తమ సొంత శరీరాలపైనే హక్కు లేకుండా పోతున్నదని వాపోయారు. నగ్నత్వం, అశ్లీలత పర్యాయపదాలు కావన్నారు. ఫాతిమా తన శరీరాన్ని తన పిల్లలకు కాన్వాస్‌లా వాడుకోనిచ్చారే తప్ప తన లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి కాదని హైకోర్టు కామెంట్ చేసింది. ప్రధానంగా స్త్రీ, పురుషుల శరీరాలను సమాజం చూసే దృష్టిలో మార్పురావాలన్న ఉద్దేశంతోనే రెహనా ఫాతిమా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్టుగా కేరళ హైకోర్టు భావించింది. పురుషుల శరీరంలో పైభాగం నగ్నంగా ఉన్నా దాన్ని లైంగిక దృష్టితో చూడని సమాజం, మహిళల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని, ఆ వివక్షను రూపుమాపడానికే తాను ఆ బాడీ పెయింటింగ్ వీడియో పెట్టానని రెహనా ఫాతిమా వివరణ ఇచ్చుకున్నారు. ఆ వివరణతో కోర్టు కూడా ఏకీభవించింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును తోసి పుచ్చింది కేరళ హైకోర్టు. రెహానాకు కేసుల నుంచి విముక్తి కల్పించింది.