ఉత్తర భారతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో(Delhi) పాటు హర్యానా(Haryana), పంజాబ్‌(Punjab), ఉత్తరాఖండ్‌(Uttarakhand), హిమాచల్‌ప్రదేశ్‌లో(Kimachal Pradesh) నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద వెల్లువలో పలు గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులు తెగిపోయాయి.

ఉత్తర భారతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో(Delhi) పాటు హర్యానా(Haryana), పంజాబ్‌(Punjab), ఉత్తరాఖండ్‌(Uttarakhand), హిమాచల్‌ప్రదేశ్‌లో(Kimachal Pradesh) నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద వెల్లువలో పలు గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులు తెగిపోయాయి. భవంతులు కూలిపోతున్నాయి. వరద నీటితో జనం నానా అవస్థలు పడుతున్నారు. ప్రజలలో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాలలోని పరిస్థితిని సమీక్షించడానికి ఓ ఎమ్మెల్యే(MLA) వెళ్లాడు. అసలే కోపంతో ఉన్న జనం ఆయన రాకను తీవ్రంగా నిరసనించారు.

ఓ బాధితురాలైతే కోపం పట్టలేక ఎమ్మెల్యేను లాగి ఒక్కటిచ్చుకున్నారు. ఈ ఘటన హర్యానాలో(Haryana) చోటు చేసుకుంది. గుహ్లా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జననాయక్‌ జనతాపార్టీ(Jannayak Janata Party) ఎమ్మెల్యే ఈశ్వర్‌ సింగ్‌(Eshwar Singh) వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. గగ్గర్‌ నది పొంగిపొర్లడంతో ఆ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. ఆనకట్ట(Dam) తెగిపోవడంతో ఓ గ్రామం మునిగిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేపై జనం తిరగబడ్డారు. ఓ మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది. ఇప్పుడు ఎందుకొచ్చావంటూ చెంప చెళ్లుమనిపించింది(slapped). చుట్టూ ఉన్న జనం బిత్తరపోయారు. అనూహ్య ఘటనకు ఎమ్మెల్యే షాక్‌ అయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనపై తర్వాత ఎమ్మెల్యే రియాక్టయ్యారు.

ఓ ఊర్లో వరద పరిస్థితిని పరిశీలించడానికి వెళ్లినప్పుడు జనం తనను తిట్టిపోశారని చెప్పుకొచ్చారు. ఇది ప్రకృతి వైపరీత్యమని, మానవ తప్పిదం కాదని మహిళకు వివరించే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదని అన్నారు. వర్షాల కారణంగా ఆనకట్ట తెగిపోయిందని చెప్పినా తన వల్లే ఆ ఉపద్రవం జరిగిందని మహిళ ఆరోపించిందని ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకున్నారు. తాను ఆ మహిళను క్షమించానని, ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు చెప్పానని ఈశ్వర్‌ సింగ్‌ అన్నారు. హర్యానాలో బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమికి జేజేపీ మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే!

Updated On 13 July 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story