హత్యకి గురైందని పోలీసు కేసు, నలుగురి అరెస్టు, 18 నెలలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిందితులు.

హత్యకి గురైందని పోలీసు కేసు, నలుగురి అరెస్టు, 18 నెలలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిందితులు. మధ్యప్రదేశ్(Madhya pradesh) లోని మండ్సర్ జిల్లాలో చోటు ఈ ఘటన చోటు చేసుకుంది. 18 నెలల క్రితం కనిపించకుండా పోయిన లలితా బాయి అనే మహిళ. పోలిసులకు ఫిర్యాదు చేసిన లలితా బాయి(Lalitha bai) తండ్రి రమేష్ బాంచాడా(Ramesh Banchada). మార్చురీలో ఉన్న ఓ మృతదేహానికి చేతి పై టాటూ ఉండడంతో మృతదేహం తమ కూతురుదే అని తల్లిదండ్రులు భావించారు. మృతదేహం గుర్తించడంలో పొరబడడంతో కూతురు చనిపోయింది అని మృతదేహం తీసుకెళ్లి వెంటనే కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. 18 నెలల తరువాత సడెన్ గా ఎంట్రీ ఇవ్వడంతో లలితా బాయిను చూసి షాక్ అయ్యిన తల్లిదండ్రులు. లలితా బాయిను పోలీసులు ప్రశ్నించగా తెలిసిన వ్యక్తి తనను మోసం చేసి రూ.5 లక్షలకు అమ్మేశాడని, ఇన్ని రోజులు బందీగా ఉండి, అవకాశం దొరకడంతో వారి చెర నుంచి బయటపడి ఇంటికి తిరిగొచ్చనని వివరించింది. ఈ పరిణామంతో చేయని హత్యకు, నలుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారని పోలీసులపై విమర్శలు వస్తున్నాయి.

ehatv

ehatv

Next Story