Saddi Annam : గుప్పెడంత చద్దన్నానికి ఇంత రేటా..!
ఒకప్పుడు చద్దన్నం(Fermented rice) తినాలంటే ఇష్టపడేవారు కాదు. ఛీఛీ ఈ చద్దన్నం ఎవరు తింటారని చీదరించుకునేవారు. తర్వాత, తర్వాత చద్దన్నం చేసే మేలును చూసి మెల్లగా ప్రజలు ఇప్పుడు ఆ దారి పడుతున్నారు. చద్దన్నంలోని పోషక(Protines) విలువలు, చద్దన్నం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల తెలుసుకొని దీనిని తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చద్దన్నం మిగిల్చి మరీ దాంట్లో పెరుగు కలుపుకుని పెట్టి పొద్దునే దానిని ఆరగిస్తున్నారు. ఇమ్యూనిటీని(Immunity) పెంపొందించడంలో చద్దన్నం కీలక పాత్ర పోషిస్తుందని డైటీషియన్లు చెప్పడంతో.. ఇప్పుడు దాని పట్ల ఆకర్షిలవుతున్నారు.

దేశ, విదేశాల్లో ఈ చద్దన్నానికి క్రేజ్ పెరగడంతో ఇప్పడు అన్ని రెస్టారెంట్లు, హోటళ్లలోని మెనూలో చద్దన్నాన్ని చేర్చుతున్నారు. ఆన్‌లైన్ ఆర్డర్స్(Online Orders), స్టార్ హోటల్స్‌లో కూడా దీనిని చేర్చుతున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని ఓ రెస్టారెంట్ చద్దన్నాన్ని విక్రయిస్తోంది. చద్దన్నం ధరను దాదాపు 13 డాలర్లకు అంటే భారత కరెన్సీలో దాదాపు వెయ్యి రూపాయలకు విక్రయిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social media) చక్కర్లు కొడుతోంది. ఓ తెలుగు ఎన్‌ఆర్‌ఐ ఈ చద్దన్నాన్ని వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్టు చేసింది. కప్పెడంత చద్దన్నానికి వెయ్యి రూపాయలా అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.