32 ఏళ్ల మహిళ ఏడేళ్లలో ఏడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆరుగురు మొగుళ్లకు విడుకులు(Divorces) ఇచ్చింది.
32 ఏళ్ల మహిళ ఏడేళ్లలో ఏడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆరుగురు మొగుళ్లకు విడుకులు(Divorces) ఇచ్చింది. ఏడో భర్తకు కూడా విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. విడాకులు కావాలని హైకోర్టును (High Court)ఆశ్రయించింది. అయితే ఏడో భర్త కాస్త తెలివిగా వ్యవహరించాడు. ఆ మహిళ గత చరిత్రనంతా హైకోర్టు దృష్టికి తీసుకురాగా హైకోర్టు ఈ భర్తలను మాటిమాటికి మార్చే భార్యకు చీవాట్లు పెట్టింది.
కర్నాటకకు(karnataka) చెందిన ఓ మహిళ శ్రీమంతులను టార్గెట్ చేసుకుంది. వారిని పెళ్లి చేసుకోవడం ఆరు నెలలకే విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించడం ఆమెకు పరిపాటైంది. ఈ క్రమంలో సదరు భర్త నుంచి కోర్టు ద్వారా సెటిల్మెంట్ అమౌంట్ తీసుకోవాలి. మళ్లీ ఇంకో శ్రీమంతుడిని పట్టాలి. పెళ్లయిన ఆరు నెలలకు భర్తపై గృహ హింస కేసు అని లేదా అత్తింటివారు వేధిస్తున్నారని విడాకుల కోసం కోర్టుకు వెళ్లి భర్త నుంచి విడిపోయి సెటిల్ చేసుకుంటుంది. కేసులు, ఆమె తీరును భరించలేక ఆమె చెప్పినట్లు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకునేవారు. ఆ తర్వాత వెంటనే మరొకరిని పెళ్లాడి అక్కడా అదే తంతు చేసేది. అయితే ఆరుగురికి విడాకులు ఇచ్చిన తర్వాత ఏడోసారి పెళ్లి చేసుకొని అతనికి కూడా విడాకులు ఇచ్చేందుకు మరోసారి హైకోర్టుకు వెళ్లిందీ నిత్య పెళ్లి కూతురు. అయితే ఏడో భర్త మాత్రం గతంలో తను చేసుకున్న పెళ్లిళ్లు, విడాకులు సమాచారాన్ని కోర్టు ముందు పెట్టడంతో హైకోర్టు జడ్జి (high court judge)సీరియస్ అయ్యారు. డబ్బు కోసం ఆ మహిళ పెళ్లిళ్లు చేసుకోవడం, తర్వాత విడాకులు తీసుకోవడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా తప్పు పట్టారు. మహిళల రక్షణ కోసం తెచ్చిన చట్టాలను ఉపయోగించుకొని మహిళలు ఇలా చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఏ భర్తతో కూడా కలిసి ఉండకపోవడంతో అందులో మీ తప్పులే అధికంగా కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ ఆగస్ట్ 21(August 21)కు వాయిదా వేశారు.కర్నాటక రాష్ట్రంలో ఇప్పుడు ఈమె వ్యవహారం సంచలనంగా మారింది.