బీహార్‌(Bihar) రాజధాని పట్నాలో(Patna) ఓ ఘోరం జరిగింది. ఫుల్వారీ షరీఫ్‌లో ఉత్తరప్రదేశ్‌కు(Uttarpradesh) చెందిన యువకుడి మృతి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అత్తామామలు, భార్య కలిసి ఆ యువకుడి గొంతునొక్కి హత్య చేశారని పోలీసులు తెలిపారు. మృతుడి భార్య అస్మెరీ ఖాతూన్‌ ఉరఫ్‌ మంజూదేవికి(Asmeri Khatoon Uraf Manjudevi) ఇది మొదటి పెళ్లి కాదు. ఇంతకు ముందే రెండుసార్లు పెళ్లిళ్లు జరిగాయి. మృతుడు సుభాష్‌ ప్రజాపతి(Subhash Prajapathi) తమ్ముడు తన వదిన గురించి తెలిపిన వివరాలు ప్రకారం ఆమెకు ప్రస్తుతం మరొకరితో సంబంధం ఉందట!

బీహార్‌(Bihar) రాజధాని పట్నాలో(Patna) ఓ ఘోరం జరిగింది. ఫుల్వారీ షరీఫ్‌లో ఉత్తరప్రదేశ్‌కు(Uttarpradesh) చెందిన యువకుడి మృతి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అత్తామామలు, భార్య కలిసి ఆ యువకుడి గొంతునొక్కి హత్య చేశారని పోలీసులు తెలిపారు. మృతుడి భార్య అస్మెరీ ఖాతూన్‌ ఉరఫ్‌ మంజూదేవికి(Asmeri Khatoon Uraf Manjudevi) ఇది మొదటి పెళ్లి కాదు. ఇంతకు ముందే రెండుసార్లు పెళ్లిళ్లు జరిగాయి. మృతుడు సుభాష్‌ ప్రజాపతి(Subhash Prajapathi) తమ్ముడు తన వదిన గురించి తెలిపిన వివరాలు ప్రకారం ఆమెకు ప్రస్తుతం మరొకరితో సంబంధం ఉందట! అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నదట! ఈ విషయం తెలుసుకున్న సుభాష్‌ భార్యను మందలించాడు. పద్దతి మార్చుకోమని హెచ్చరించాడు. దీంతో ఆమె సుభాష్‌ను హత్య చేసిందని మృతుడి బంధువులు అంటున్నారు. రెండేళ్ల కిందట అస్మెరీ ఖాతూన్‌ను సుభాష్‌ ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు. అయితే పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం మృతుడు అదే పనిగా తాగుతుండేవాడు. భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. భర్త పెట్టే హింస భరించలేక ఆమె హత్య చేసింది. అస్మెరీకి గతంలోనే రెండు వివాహాలు జరిగాయి. ఆమె వారిని వదిలిపెట్టిన తర్వాత మూడోసారి సుభాష్‌ను పెళ్లి చేసుకుంది. అస్మెరీకి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుభాష్‌ అన్న బ్రజేష్‌ మాట్లాడుతూ ' తన తమ్ముడి భార్య అస్మెరీ ఖాతూన్‌ ప్రస్తుతం మరో యువకుడితో సంబంధం ఏర్పరుచుకున్నది. ఈ సంగతి తెలిసిన తన సోదరుడు ఆమెను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అస్మెరీ తన తల్లిదండ్రులతో కలిసి సుభాష్‌ను గొంతు నొక్కి చంపేశారు' అని చెప్పాడు. సుభాష్‌ హత్య గురించి తమకు తెలియగానే తాము సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని ఫుల్వారీ పోలీసు ఉన్నతాధికారి సఫిర్‌ ఆలం చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాని తెలిపారు.

Updated On 11 Sep 2023 4:12 AM GMT
Ehatv

Ehatv

Next Story