ఓ జంట పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల పాటు వీరిద్దరి కాపురం హాయిగా సాగిపోయింది. పెళ్లయిన కొత్తలో భార్యకు ఇష్టమైన మోమోలు(Momos) ప్రతి రోజూ భర్త తీసుకొచ్చేవాడు. సాధారణంగా పెళ్లయిన కొత్తలో ఉన్నంత మోజు ఉండదు కాదా.. రానురాను తన భార్యకు మోమోలు తేవడం మర్చిపోయేవాడు. దీంతో ఆ భార్య మనస్తాపం చెందింది. భర్తపై కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాదు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ జంటను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి సముదాయించారు. కొన్ని కండీషన్స్‌తో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pardesh) ఆగ్రా జిల్లా మల్పురాకు చెందిన ఒక మహిళకు పినహట్‌కు చెందిన వ్యక్తితో ఎనిమిది నెలల కిందట వివాహం జరిగింది. ఉత్తర భారత్‌లో ఎక్కువగా ఇష్టపడే చిరు తిండి అయిన మోమోలు అంటే అతని భార్యకు ఎంతో ఇష్టం. పెళ్లైన కొత్తలో విధులు ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో రోజూ భార్య కోసం మోమోలు తీసుకొచ్చేవాడు. అయితే కొంత కాలంగా పని ఒత్తిడి వల్ల భార్యకు మోమోలు తేవడం లేదు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన భార్య తన పుట్టింటికి వెళ్లింది. అంతే కాదండి.. ఏకంగా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త ప్రతి రోజూ మోమోలు తీసుకురావడం లేదని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. భార్యాభర్తలను ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌కు పిలిపించారు. పని ఒత్తిడి వల్లే ఇంటికి రావడం ఆలస్యమవతుందని.. ఇంటికి త్వరగా చేరుకోవాలని భావించి కొన్నిసార్లు భార్య కోసం మోమోలు తీసుకురావడం మరిచిపోతున్నట్లు కౌన్సెలింగ్‌లో భర్త తన బాధలు చెప్పుకొచ్చాడు. మరోవైపు తన భర్త తనకు ప్రతి రోజు మోమోలు తీసుకురావాల్సిందేనని ఆ మహిళ మొండికేసింది. అయితే పోలీసులు మాత్రం ఇద్దరి మధ్య ఒక డీల్‌ కుదిర్చారు. తన భార్య కోసం వారానికి రెండు సార్లు తప్పకుండా మోమోలు తీసుకురావాలని భర్తకు షరతులు విధించారు. ఇందుకు మహిళ కూడా ఒప్పుకోవడంతో ఇద్దరినీ పోలీసులు ఇంటికి పంపించారు. దీంతో ఈ జంట మధ్య మోమోల గొడవ సుఖాంతమైంది.

Updated On 29 Feb 2024 1:44 AM GMT
Ehatv

Ehatv

Next Story