ఓ మహిళ తన భర్తను చిత్రహింసలకు(Torture) గురిచేస్తోంది. ఏకంగా అతనిని కట్టేసి సిగరెట్లతో(cigarettes) శరీరభాగాలను కాల్చింది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బిజ్నోర్‌లో(Bijnore) ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో మహిళను అరెస్ట్‌ చేశారు పోలీసులు. సియోహరా జిల్లాకు చెంది మెహర్‌ జహాన్‌ను అనే మహిళ భర్త మనన్ జైదీ కాళ్లూ చేతులు కట్టేసి భార్య సిగరెట్‌తో అతని శరీర భాగాలను కాల్చేసింది.

ఓ మహిళ తన భర్తను చిత్రహింసలకు(Torture) గురిచేస్తోంది. ఏకంగా అతనిని కట్టేసి సిగరెట్లతో(cigarettes) శరీరభాగాలను కాల్చింది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బిజ్నోర్‌లో(Bijnore) ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో మహిళను అరెస్ట్‌ చేశారు పోలీసులు. సియోహరా జిల్లాకు చెంది మెహర్‌ జహాన్‌ను అనే మహిళ భర్త మనన్ జైదీ కాళ్లూ చేతులు కట్టేసి భార్య సిగరెట్‌తో అతని శరీర భాగాలను కాల్చేసింది. మెహర్ జహాన్ అతనిపై దాడి చేయడం, చేతులు, కాళ్ళు కట్టివేసి, అతని ఛాతీపై కూర్చొని ఊపిరి ఆడకుండా చేసి చంపడానికి ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని భర్త పోలీసులకు అందించాడు. వీడియోలో, ఆమె సిగరెట్‌తో తన భర్త శరీర భాగాలను కాల్చడం చూడవచ్చు. అయితే తన భార్య ఆగడాలపై గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. తన భార్య తనకు మత్త మందు ఇచ్చి చిత్రహింసలకు గురిచేసేదని భర్త ఆరోపిస్తున్నాడు. దీంతో భార్యపై హత్యాయత్నం, దాడి, చిత్రహింసలతోపాటు పలు సెక్షన్ల కింద మెహర్ జహాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Updated On 7 May 2024 1:15 AM GMT
Ehatv

Ehatv

Next Story