బీహార్(Bihar) రాష్ట్రం బక్సర్(Buxar) జిల్లాలోని చోట్కీ నైనిజోర్(Chotki Nainizor) అనే గ్రామంలో భరత్ యాదవ్(Bharath Yadav) కుటుంబం నివాసం ఉంటోంది. భరత్ యాదవ్ భార్య జ్ఞానతి దేవి(Gnanati Devi) (32) ఒకే కాన్పులో నలుగురు(Quadruplets) పిల్లలకు జన్మనిచ్చింది. నెలలు నిండిన తర్వాత పురిటి నొప్పులు రావడంతో జ్ఞానతిదేవిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో జ్ఞానతిదేవి నలుగురు మగ పిల్లలను ప్రసవించింది.
సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరు పిల్లలు పుట్టడం సహజం. కానీ ఒకేసారి నలుగురు పిల్లలు పుట్టడం బహుషా అరుదైన ఘటనే అని చెప్పుకోవచ్చు.
తాజాగా ఇలాంటిదే మన దేశంలో జరిగింది. బీహార్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బీహార్(Bihar) రాష్ట్రం బక్సర్(Buxar) జిల్లాలోని చోట్కీ నైనిజోర్(Chotki Nainizor) అనే గ్రామంలో భరత్ యాదవ్(Bharath Yadav) కుటుంబం నివాసం ఉంటోంది. భరత్ యాదవ్ భార్య జ్ఞానతి దేవి(Gnanati Devi) (32) ఒకే కాన్పులో నలుగురు(Quadruplets) పిల్లలకు జన్మనిచ్చింది. నెలలు నిండిన తర్వాత పురిటి నొప్పులు రావడంతో జ్ఞానతిదేవిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో జ్ఞానతిదేవి నలుగురు మగ పిల్లలను ప్రసవించింది. దీంతో ఒక్కసారిగా భరత్ యాదవ్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఈ విషయం తెలసుకుని గ్రామస్తులు కూడా ఆస్పత్రికి వచ్చి పిల్లలను చూస్తున్నారు.
అయితే జ్ఞానతీదేవికి సర్జరీ చేసిన గైనకాలజిస్ట్(Gynecologist) డాక్టర్ గుంజన్ సింగ్ షాకింగ్ విషయాలు చెప్పారు. జ్ఞానతి దేవి గర్భంలో నలుగురు పిల్లలు ఉన్నట్టు ముందుగా తమకు తెలియలేదని చెప్పారు. ఆపరేషన్ సమయంలోనే ఆ మహిళ కడుపులో నలుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని.. నలుగురు శిశువులు, తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ గుంజన్ సింగ్ వెల్లడించారు. ఈ ఆసుపత్రి చరిత్రలో ఒకేసారి నలుగురు పిల్లలు పుట్టడం ఇదే మొదటిసారి అని తెలిపారు. జ్ఞానతిదేవి, భరత్‌యాదవ్‌కు గతంలో కూడా ఒక మగ పిల్లాడు ఉన్నాడు. ఈ నలుగురు పిల్లలతో కలిసి వారికి ఐదుగురు సంతానం. చిన్న అసంతృప్తి ఉందని.. అదేంటంటే... ఒకేసారి నలుగురు పిల్లల ఆలనా, పాలనా చూసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందంటున్నాడు తండ్రి భరత్ యాదవ్. ఒకేసారి పాలు పట్టించడం వంటి విషయాల్లో కష్టమవుతుందన్నాడు. అయితే రానురాను ఈ బాలారిష్టాలు తొలగిపోతాయన్నారు. ఎన్నికష్టనష్టాలకోర్చయినా తమ ఐదుగురు పిల్లలను పెంచి ప్రయోజకులను చేస్తామని తండ్రి భరత్ యాదవ్ తెలిపాడు.