భారతీయ సమాజ నిర్మాణ మూలస్తంభాల్లో వివాహ(Marriage) బంధం ప్రాముఖ్యత ఎంతగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. భగవంతుడు మనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించేందుకే వివాహం చేసుకుంటారని భారతదేశంలో భావిస్తారు. రెండు జీవితాల కలిసి, మరో రెండు కుటుంబాలను కలిపి ఎన్నో బంధుత్వాలను ఏర్పరిచే విశిష్ట వేడుకనే వివాహం.

భారతీయ సమాజ నిర్మాణ మూలస్తంభాల్లో వివాహ(Marriage) బంధం ప్రాముఖ్యత ఎంతగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. భగవంతుడు మనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించేందుకే వివాహం చేసుకుంటారని భారతదేశంలో భావిస్తారు. రెండు జీవితాల కలిసి, మరో రెండు కుటుంబాలను కలిపి ఎన్నో బంధుత్వాలను ఏర్పరిచే విశిష్ట వేడుకనే వివాహం. వివాహం అనేది 1,000 సంవత్సరాల పంట. వివాహాలు స్వర్గంలో ఏర్పాటు చేయబడతాయి. పిల్లల కోసం కుటుంబం కోసం, భార్యాభర్తలు అనేక విబేధాలు ,సమస్యలు ఉన్నప్పటికీ కలిసి మెలిసి జీవిస్తుంటారు. కానీ ఇప్పుడు విడాకులు(Divorce) పెరుగుతున్నాయి. చిన్న, చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటున్నారు. పెరుగుతున్న పాశ్చాత్య సంస్కృతి, రోజురోజుకూ కుచించుకుపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ

అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్కపిల్ల.. కవితకు కాదేదీ అనర్హం అంటూ శ్రీశ్రీ చెప్పినట్లు ఈ కాలంలో విడాకులకు కారణమం ఇదీ, అదీ అని కాదు. చీటికేస్తే విడాకులు అనడం సర్వసాధారణమై పోయింది. బలహీనపడుతున్న బాంధవ్యాలు, కారణాలేవైనా ప్రస్తుతం విడాకులనేవి సర్వ సాధారణమైపోయాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రం పేరుతో తమ వైవాహిక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో పిల్లల భవిష్యత్‌ను ఫణంగా పెడుతున్నారు. సిల్లీ రీజన్స్‌తో కోర్టు మెట్లు ఎక్కి విడాకుల కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇలా వారి పిల్లలలకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని మిస్‌ అవుతున్నారు. అలా దూరమైన పిల్లలు కొందరు మానసికంగా బలహీనపడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరికొందరు తమలో సంఘం పట్ల వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమై చెడు వ్యసనాలకు కూడా అలవాటు పడుతున్నారు. కుటుంబంలో భార్యా భర్తల మధ్య చెలరేగే చిన్న చిన్న గొడవలను పరిష్కరించే పెద్దలు కూడా వారి దగ్గర లేకపోవడంతో ఈ విడాకులు మరిన్ని పెరిగిపోతున్నాయి. దంపతుల మధ్య ఏలాంటి చిన్న తగువు వచ్చినా అది చిలికి చిలికి గాలి వానగా మారి జీవితాల్లో విడాకులనే పెనుతుఫానుకు కారణమవుతోంది.

అయితే ఇప్పుడు ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటనే ఒకటి జరిగింది. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) ఆగ్రాలోని(agra) ఓ మహిళ ఇటీవల తన భర్త తనకు కుర్కురే(Kurkure chips) ప్యాకెట్‌ను అందజేయకపోవడంతో విడాకులు కోరింది. ఈ జంట గత సంవత్సరం వివాహం చేసుకుంది. పెళ్లయిన కొత్తలో ఈ జంట అన్యోన్యంగానే ఉంది. అయితే, నెలలు గడిచేకొద్దీ, తన భార్యకు కుర్కురేను తినడం అలవాటు చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రతిరోజూ ఈ మహిళ తన భర్తను కుర్కురే ప్యాకేట్‌ తేవాలని కోరేది. కొత్తలో ప్రతిరోజూ తీస్కొచ్చినా కానీ రానురాను అతను ఈ పనిచేయడానికి నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక భర్తపై ఆగ్రహం చెందిన మహిళ అత్తింటిని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాదు ఏకంగా పోలీసులను ఆశ్రయించి భర్తతో విడాకులు ఇప్పించాలని కోరింది. అయతే ఈ జంటను ఆగ్రాలోని షాగంజ్ పోలీసులు కుటుంబ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

Updated On 14 May 2024 4:30 AM GMT
Ehatv

Ehatv

Next Story