తాగుడుకు బానిసై వేధిస్తున్నాడని భర్తను చంపించింది ఓ మహిళ. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి మరీ అంతమొందించింది.
తాగుడుకు బానిసై వేధిస్తున్నాడని భర్తను చంపించింది ఓ మహిళ. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి మరీ అంతమొందించింది. గుండెపోటుతో చనిపోయాడని ప్రచారం చేసింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో వెలుగు చూసింది. యమకనమరడి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హుక్కేరి తాలూకా హట్టిఆలూరు గ్రామానికి చెందిన మహంతేశ్ (34), భార్య మాలా, గతేడాది ఏప్రిల్‌లో పడుకున్న చోటే అతడు చనిపోయాడు. గుండెపోటు వచ్చిందని అతని భార్య మాలా అందరినీ నమ్మించింది. తన అన్న చావుపై అనుమానాలు ఉన్నాయని అతని సోదరుడు కల్లప్ప జనవరి 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో పోలీసులకు అసలు నిజాలు బయటపడ్డాయి. భర్త నిత్యం తాగి వచ్చి వేధిస్తుండడంతో మాలా అదే గ్రామానికి చెందిన ఆకాశ్ అనే వ్యక్తికి రూ.70వేలు ఇచ్చి భర్తను హతమార్చాలని కోరింది. ఆకాష్ తన స్నేహితులతో కలిసి మహంతేష్‌కు మద్యం తాగించి తాడుతో గొంతుకు బిగించి హత్య చేశాడు. ఏమీ ఎరుగనట్లు తీసుకువచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత మరో రూ.30 వేలు ఫోన్ పే చేసింది. తెల్లారిన తర్వాత తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని ఏడ్వడం ప్రారంభించింది. నిజమే అని నమ్మిన బంధువులు అంత్యక్రియలను పూర్తి చేశారు. కానీ తన సోదరుడికి మహంతేశ్ మృతిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శవాన్ని వెలికి తీయించి పంచనామా నిర్వహించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.