భర్త చనిపోయి 11 ఏళ్లు.. కానీ ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది..
ఓ మహిళకు భర్త(Husband) చనిపోయి 11 ఏళ్లవుతుందని ఆమెనే స్వయంగా చెప్తోంది. కానీ ఈ మధ్యనే మరో బిడ్డకు(Baby) జన్మనిచ్చింది. అదేలా సాధ్యమంటే తనొక వింత వాదన చేసింది. ఆమె సమాధానం వింటే నోరెళ్లపెట్టక మానరు. దయ్యాలు(Ghost) వచ్చి తమకు నచ్చినవారిని రేప్(rape) చేయడం వంటి సంఘటనలు సినిమాల్లోనే చూస్తాం. కానీ తనకు ఇదే జరిగింది అనేది ఆ మహిళ వర్షన్. 11 ఏళ్ల క్రితం చనిపోయిన భర్త తనకు కలలో వచ్చాడని, తనతో గడిపాడని చెప్తోంది. 11 ఏళ్లుగా తన భర్త తన కలలోకి వచ్చి అన్ని పనులు చేసేవాడని చెప్తోంది. తన భర్త ద్వారానే తాను ఈ బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్తోంది. ఇదంతా దైవ మహిమ అంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తను చెప్పిన వాదన విని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే 11 ఏళ్లుగా ఆమె ఒంటరిగా బతుకుతోంది. పిల్లలను ఎలా కనిందనే ప్రశ్నలు ఆపి ఆ మహిళను పిల్లలతో ప్రశాంతంగా బతకనివ్వండని సూచిస్తున్నారు. ఎవరో తనను ఏమార్చి అత్యాచారం చేసి ఉంటారని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా మహిళను ప్రశాంతంగా బతకనివ్వాలని కోరుతున్నారు