మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అడవిలో 50 ఏళ్ల మహిళను చెట్టుకు ఇనుప గొలుసులతో కట్టివేశారు.

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అడవిలో 50 ఏళ్ల మహిళను చెట్టుకు ఇనుప గొలుసులతో కట్టివేశారు. ఆమె దగ్గర US పాస్‌పోర్ట్ ఫోటోకాపీ కూడా దొరికింది. అంతేకాకుండా.. తమిళనాడు చిరునామాతో కూడిన ఆధార్ కార్డ్‌, ఇతర పత్రాలు కూడా దొరికాయి. సోనుర్లి గ్రామంలో ఒక గొర్రెల కాపరి ఆమె కేకలు వేయడం విన్నాడు. ఆమెను గొలుసులతో కట్టివేయడం చూసి పోలీసులను అప్రమత్తం చేశాడు.

"మహిళను సావంత్‌వాడి (రాష్ట్రంలోని కొంకణ్ ప్రాంతంలో)లోని ఆసుపత్రికి, ఆపై సింధుదుర్గ్‌లోని ఓరోస్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె మానసిక, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఆమెను అధునాతన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతానికి ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది. వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతోందని.. ఆమె వద్ద మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లు ఉన్నాయి" అని పోలీసులు తెలిపారు.

పోలీసులకు లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, మహిళ గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఉందని అధికారులు తెలిపారు. "మహిళ తన స్టేట్‌మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదు. రెండు రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆ మహిళ బలహీనంగా ఉంది. ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. తమిళనాడుకు చెందిన ఆమె భర్త ఆమెను అక్కడ కట్టేసి పారిపోయాడని బలంగా నమ్ముతున్నాము." అని తెలిపారు. విచారణలో భాగంగా ఆమె బంధువులు, తదితరులను కనిపెట్టేందుకు పోలీసు బృందాలు తమిళనాడు, గోవా తదితర ప్రాంతాలకు బయలుదేరినట్లు అధికారి తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story