మరో 25 రోజుల్లో మనం ప్రయోగించిన చంద్రయాన్-3(chandrayan-3) చంద్రుడి మీద అడుగుపెట్టనుంది. అంతరిక్షం అంతు తేల్చుతున్నాం కానీ మనలో ఉన్న మూఢత్వాన్ని మాత్రం వదిలిపెట్టుకోలేకపోతున్నాం.. అంధవిశ్వాసాలతో తిరోగమిస్తున్నాం. ఒడిశాలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు పెద్ద ఉదాహరణ. కొత్తగా తీసుకొచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్‌గా ఎక్కకుండా ఆపేసిన ఆ ఘటన మనం ఇంకా ఏ దశలో ఉన్నమో చెబుతోంది.
మరో 25 రోజుల్లో మనం ప్రయోగించిన చంద్రయాన్-3(chandrayan-3) చంద్రుడి మీద అడుగుపెట్టనుంది. అంతరిక్షం అంతు తేల్చుతున్నాం కానీ మనలో ఉన్న మూఢత్వాన్ని మాత్రం వదిలిపెట్టుకోలేకపోతున్నాం.. అంధవిశ్వాసాలతో తిరోగమిస్తున్నాం. ఒడిశాలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు పెద్ద ఉదాహరణ. కొత్తగా తీసుకొచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్‌గా ఎక్కకుండా ఆపేసిన ఆ ఘటన మనం ఇంకా ఏ దశలో ఉన్నమో చెబుతోంది. ఒడిశాలో(Odisha) ఇటీవల కొత్తగా బస్సులు తీసుకొచ్చారు. ఇందులో మహిళలను మొదటి ప్యాసింజర్‌గా ఎక్కకుండా భువనేశ్వర్‌లోని బారాముండా బస్సు స్టేషన్‌లో(Barramunda Bus Station) ఆపేశారు.
ఈ ఘటనపై సామాజిక కార్యకర్త ఘాసిరామ్ పాండా రాష్ట్ర మహిళా కమిషన్‌కు(Ghasiram Panda State Commission for Women) కంప్లయింట్ చేశారు. దీనిపై కమిషన్ వెంటనే స్పందించింది. రాష్ట్ర రవాణా యంత్రాంగానికి సూచనలు చేసింది. మహిళలు మొదటి ప్యాసింజర్‌గా ఎక్కితే ఆ రోజు బస్సుకు ప్రమాదం జరుగుతుందనో, కలెక్షన్లు తక్కువవుతాయనో నమ్ముతున్నారు. దీన్ని వివక్ష అనలేమని, కచ్చితంగా ఇది మూఢత్వమేనని మహిళా కమిషన్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్.. మహిళలను తొలి ప్రయాణికులుగా ఎక్కేందుకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని రవాణాశాఖకు సూచనలు చేసింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని గుర్తు చేసింది. ఇక ముందు మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారి గౌరవాన్ని కాపాడేందుకు పాటుపడాలని స్పష్టం చేసింది.