ఓ రౌడీషీటర్ ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో అన్ని రకాల సుఖాలను పొందాడు.
ఓ రౌడీషీటర్ ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో అన్ని రకాల సుఖాలను పొందాడు. ఏకంతంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకొని దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు బెంగళూరులోని బ్యాడరహళ్లీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రౌడీషీటర్ సురేష్ అలియాస్ కుణిగల్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాధితురాలి ఇంట్లో రౌడీషీటర్ కొన్నేళ్లుగా కిరాయికి ఉంటున్నాడు. క్యాబ్ డ్రైవర్ అని చెప్పి ఆమె ఇంట్లో దిగాడు. ఆ తర్వాత ఆమెతో చనువు పెంచుకున్నాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి కారణమైంది. ఇద్దరు ఏకాంతంగా గడిపిన సమయంలో మొబైల్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. అతని మొబైల్‌లో పలువురు మహిళలు వీడియోలు ఉండడం చూసి ఆమె గొడవచేసి దూరం పెట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన రౌడీషీటర్ మహిళను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేశాడు. అంతేకాకుండా వీడియోలను ఆమె భర్తకు, బంధువులకు పంపించాడు. ఈ క్రమంలోనే తన ఫోన్, కారు, 18 గ్రాముల బంగారునగలు తీసుకొని పరారయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో సురేష్‌పై కేసు ఉందని.. పరప్పన జైలులో గడిపాడని.. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తామని పోలీసులు తెలిపారు.