ఢిల్లీలో(Delhi) ఆదివారం నాడు జలమయమైన రహదారి గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళ విద్యుత్ స్తంభాన్ని తాకడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సాక్షి అహుజా అనే మహిళ ఆదివారం ఉదయం 5.30 గంటలకు తన సోదరి, ముగ్గురు పిల్లలతో కలిసి భోపాల్‌కు వెళ్లాల్సివుండగా.. రైలు ఎక్కేందుకు న్యూఢిల్లీ రైల్వే(New Delhi) స్టేషన్‌కు చేరుకుంది. అయితే స్టేషన్ వెలుపల జలమయమైన రహదారిని(High way) దాటుతున్నప్పుడు..
ఢిల్లీలో(Delhi) ఆదివారం నాడు జలమయమైన రహదారి గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళ విద్యుత్ స్తంభాన్ని తాకడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సాక్షి అహుజా అనే మహిళ ఆదివారం ఉదయం 5.30 గంటలకు తన సోదరి, ముగ్గురు పిల్లలతో కలిసి భోపాల్‌కు వెళ్లాల్సివుండగా.. రైలు ఎక్కేందుకు న్యూఢిల్లీ రైల్వే(New Delhi) స్టేషన్‌కు చేరుకుంది. అయితే స్టేషన్ వెలుపల జలమయమైన రహదారిని(High way) దాటుతున్నప్పుడు.. ఆమె సపోర్టు కోసం విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురైంది. విద్యుత్ స్తంభం నుంచి కొన్ని వైర్లు బయటకు రావడం.. అది గమనించకపోవడంతో మహిళ ప్రాణాలను కోల్పోయింది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుదాఘాతానికి(Electrocution) గురైన మహిళను సమీపంలోని వ్యక్తులు రక్షించడానికి ప్రయత్నించారు. ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అధికారుల నిర్లక్ష్యంపై మహిళ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు మాట్లాడుతూ.. ఇన్సులేషన్ వైఫల్యం కారణంగా స్తంభంపై ఉన్న కేబుల్ నుండి కరెంట్ పాసైందని చెప్పారు. ఐపీసీ సెక్షన్లు 287, 304 (యంత్రాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం) కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపింది.