గుజరాత్‌లోని(gujarat) జలాల్‌పూర్‌లో ఓ యువతి మృతి చెందింది.
గుజరాత్‌లోని(gujarat) జలాల్‌పూర్‌లో ఓ యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ యువతి నవ్సారిలో(Navsari) నర్సింగ్ కోర్సు మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ యువతికి మూడేళ్ల క్రితం ఓ యువకుడు పరిచయమైనా అంత డీప్ కాలేదు. మళ్లీ ఏడు నెలలు క్రితం సోషల్ మీడియా ద్వారా దగ్గరయ్యారు. సోషల్ మీడియాలో రోజూ మాట్లాడుకుంటూ ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే గత నెల 23న వీరు ఏకాంత సమయం గడపాలనుకున్నారు. నవ్సారిలో ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ సెక్స్‌లో(Intimidating) పాల్గొన్నారు. దీంతో యువతికి రక్తస్రావం(Bleeding) ప్రారంభమైంది. బ్లీడింగ్ ఎంతకూ ఆగలేదు.. అయినా ఆమెను అతను ఆస్పత్రికి తరలించలేదు. యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో బ్లీడింగ్ ఎలా ఆగుతుందో అని సెర్చ్ చేశాడు. కంటిన్యూగా బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఆమెకు అధిక రక్తస్రావం అవుతున్నా మరోసారి తనతో సెక్స్‌లో పాల్గొనడానికి ప్రయత్నించాడు. 108 లేదా వైద్య సహాయం కోసం అతను ప్రయత్నించలేదు. అధిక రక్త స్రావం కావడంతో యువతి మృతి చెందింది. హోటల్‌లో గంట నుంచి గంటన్నర సమయం వృధా చేయడంతో ఆమె మృతి చెందిందని తెలిసింది. ఆమె మధ్యాహ్నం 2.15 గంటలకు మరణించినట్లు ప్రకటించారు. హోటల్ నుంచి వెళ్లేముందు సాక్ష్యాలను మాయం చేశాడు, రక్తం మరకలను శుభ్రం చేశాడు. అధిక రక్త స్రావంతోనే బాధితురాలు మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదక కూడా వచ్చింది. దీంతో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.