చివరికి కొడుకు వరుసైనవాడితో పెళ్లి..!
ప్రేమ పేరుతో 12 మందికి వల వేసింది. ఎంత వస్తే అంత డబ్బు వారి దగ్గర నుంచి వసూలు చేసింది. చివరికి కొడుకు వరుసైన 19 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకుంది. తమిళనాడులోని(Tamilnadu) తిరవళ్లూరులో(Tiravalluru) జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ కిలేడీ ఘటన చర్చనీయాంశమైంది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు బాలాజీ నగర్‌కు చెందిన 24 ఏళ్ల యువతి నర్సింగ్ డిప్లొమో(Nursing Diploma) పూర్తి చేసింది. అనంతరం నడవలేని స్తితిలో వున్న రోగుల ఇంటి వద్దకే వెళ్లి చికిత్స చేయడంతో పాటు కేర్‌టేకర్‌గా(caretaker) పని చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం యువతి అదృశ్యమైంది. యువతి తల్లి సెవ్వాపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో యువతి కనిపించకుండా పోయినరోజే ఆమెతో సన్నిహితంగా మెలిగే సమీప బంధువు కొడుకు వరుసయ్యే 19 ఏళ్ల యువకుడు కూడా అదృశ్యమయ్యాడు. ఇద్దరి కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. అయితే వారిద్దరూ చెన్నైలోని మురుగన్ ఆలయం వివాహం చేసుకున్నట్లు పోలీసులకు తేలింది. స్వయంగా ఇదే విషయాన్ని యువతి తన లాయర్ల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఇద్దరినీ విచారణ నిమమిత్తం పిలిచారు. యువతి, యువకుడు కౌన్సెలింగ్ హాజరుకావడంతో విషయం తెలుసుకున్న ఆమె వల్ల మోసపోయిన బాధితుల 12 మంది క్యూ కట్టారు. ఇందులో ఆమె మేనమామ కూడా ఉన్నారు. ప్రేమ పేరుతో వలపు వల విసిరి తమను మోసం చేసిందని తమ దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారైందని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ డబ్బులను తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఖంగుతిన్నారు. విచారణ ఎలా చేయాలో, ముగింపు ఎలా పలకాలో అర్థం కాక అయోమయంలో పడిపోయారు. కౌన్సెలింగ్ ఇచ్చి యువతీయువకుడిని ఇంటికి పంపించారు. ఆవడి కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని యువతి బాధితులకు సెవ్వాపేట పోలీసులు సూచించారు. ఇంత మందిని మోసగించి కొడుకు వరుసయ్యే వాడిని వివాహం చేసుకున్న యువతి మాత్రం.. తమ కాపురం కూల్చొద్దని.. అతనితోనే కాపురం చేస్తానని పోలీస్‌స్టేషన్‌లో యువతి హడావిడి చేసింది.