నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కేవైసీ (KYC) చేయని ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 31లోగా కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవాలని హైవే అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ పలు వాహనాలకు ఉపయోగించడాన్ని లేదా ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్‌లను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కేవైసీ (KYC) చేయని ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 31లోగా కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవాలని హైవే అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ పలు వాహనాలకు ఉపయోగించడాన్ని లేదా ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్‌లను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 31 జనవరి 2024 తర్వాత కేవైసీ అప్‌డేట్ లేని ఫాస్టాగ్‌లు డియాక్టివేట్ చేయడం లేదా బ్లాక్‌లిస్ట్‌లో ఉంచుతారు. కొత్త FASTag ఖాతా మాత్రమే యాక్టివ్‌గా ఉంటుందని తెలిపింది. ఒక వాహనం కోసం ఒకటి కంటే ఎక్కువ ఫాస్ట్‌ట్యాగ్‌లు ఉండడం... KYC లేకుండా ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేయకూడదన్న ఆర్‌బీఐ (RBI ) నిబంధన ఉల్లంఘన అవుతుందని హైవే అథారిటీ ప్రకటించింది.

కేవైసీ అప్‌డేట్‌ చేసుకోండిలా..!

-> కేవైసీ అప్‌డేట్‌ కోసం https://fastag.ihmcl.com వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి.
-> రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ వంటి వివరాలు ఎంటర్‌ చేసిన తర్వాత మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.
-> లాగిన్ అయిన తర్వాత, డాష్‌బోర్డ్‌లో "మై ప్రొఫైల్" విభాగం అందుబాటులో ఉంటుంది. ఇది KYC స్టేటస్‌, ప్రొఫైల్ వివరాలను చూపిస్తుంది.

KYC పెండింగ్‌లో ఉంటే ఏం చేయాలి?

-> ప్రొఫైల్ విభాగంలో, KYC అనే సబ్‌సెక్షన్‌లో కేవైసీని అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది.
-> అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, చిరునామా పత్రాలను సమర్పించి, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్‌ చేయాల్సి ఉంటుంది.
-> సబ్మిట్ బటన్‌ క్లిక్‌ చేసే ముందు వినియోగదారులు చెక్‌ అండ్‌ కన్ఫర్మేషన్‌ బటన్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.
-> ప్రొసీడ్‌ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత KYC ధృవీకరణ ప్రక్రియ పూర్తవుతుంది.

Updated On 16 Jan 2024 6:28 AM GMT
Ehatv

Ehatv

Next Story