పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు(Winter Session Of Parliament) వచ్చే నెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సమావేశాలలో 18 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం(Central0 నిర్ణయించింది. వీటిల్లో రెండు జమ్ముకశ్మీర్‌, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్లు వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షా స్మృతి బిల్లులు ఉన్నాయి.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు(Winter Session Of Parliament) వచ్చే నెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సమావేశాలలో 18 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం(Central0 నిర్ణయించింది. వీటిల్లో రెండు జమ్ముకశ్మీర్‌, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్లు వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షా స్మృతి బిల్లులు ఉన్నాయి. శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్​ అసెంబ్లీ లో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114 కు పెంచే బిల్లు పార్లమెంట్​ ముందుకు రానుంది. దీని వల్ల కశ్మీర్​ నుంచి వలస వెళ్లిన వారికి, శరణార్థులకు, ఎస్టీ లకు చట్ట సభలో ప్రాతినిథ్యం లభించనుంది.
ఈ బిల్లులతో పాటు 2023-24 కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్ల పై సమావేశాల్లో చర్చ, ఓటింగ్​ జరగనుంది.. ఐపీసీ చట్టాల స్థానంలో ద భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్రం తీసుకొస్తున్నది. సమావేశాల ప్రారంభానికి ముందు డిసెంబర్​ 2 న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి తెలిపారు..

Updated On 30 Nov 2023 5:32 AM GMT
Ehatv

Ehatv

Next Story