Chiranjeevi: రామాలయ ప్రారంభోత్సవానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్తా: చిరంజీవి
భారతదేశమంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్న మధురమైన ఘట్టానికి సమయం దగ్గర పడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (UtharPradesh) అయోధ్య రామాలయ (Ayodhya Ramalyam) ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 22న మధ్యాహ్నం 12:45 నిమిషాలకు మూహూర్తం ఖరారు చేయగా.. అందుకోసం చకచకా పనులు కొనసాగిస్తున్నారు.

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తనకు కూడా ఆహ్వానం అందిందని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ‘హనుమాన్’ (HanuMan) చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి వెళ్తానని చిరంజీవి వెల్లడించారు.
అయోధ్యలో ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు అందుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి అమితాబ్ బచ్చన్ (Amithab Bachan), రజినీకాంత్ (Rajinikanth), మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, అలియా భట్, దీపికా పదుకొణె సహా పలువురు అగ్రనటులకు ఆహ్వానాలు అందాయి. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7వేల మంది హాజరవుతారని అంచనాలు వేస్తున్నారు.