అందరూ ఊహించినట్టే వరుణ్‌గాంధీకి(Varun Gandhi) భారతీయ జనతాపార్టీ మొండిచేయి చూపించింది. పిలిభిత్‌ లోక్‌సభ స్థానం(pilibhit lok sabha) ఎప్పట్నుంచో గాంధీ కుటుంబీకుల సంప్రదాయ స్థానం. వరుణ్‌గాంధీ తల్లి, సంజయ్‌గాంధీ(Sanjay Gandhi) సతీమణి మేనకాగాంధీ(Menaka Gandji) ఇక్కడి నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. రెండుసార్లు వరుణ్‌గాంధీ గెలిచారు. ఈసారి బీజేపీ(BJP) వరుణ్‌గాంధీకి పిలిభిత్‌ టికెట్‌ ఇవ్వలేదు.

అందరూ ఊహించినట్టే వరుణ్‌గాంధీకి(Varun Gandhi) భారతీయ జనతాపార్టీ మొండిచేయి చూపించింది. పిలిభిత్‌ లోక్‌సభ స్థానం(pilibhit lok sabha) ఎప్పట్నుంచో గాంధీ కుటుంబీకుల సంప్రదాయ స్థానం. వరుణ్‌గాంధీ తల్లి, సంజయ్‌గాంధీ(Sanjay Gandhi) సతీమణి మేనకాగాంధీ(Menaka Gandji) ఇక్కడి నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. రెండుసార్లు వరుణ్‌గాంధీ గెలిచారు. ఈసారి బీజేపీ(BJP) వరుణ్‌గాంధీకి పిలిభిత్‌ టికెట్‌ ఇవ్వలేదు. జతిన్‌ ప్రసాద్‌ను(Jathin Prasad) బరిలో దింపింది. వరుణ్‌గాంధీకి బీజేపీ టికెట్‌ ఇవ్వదని అనుకున్నదే! ఎందుకంటే ఆయన నరేంద్రమోదీ(Narendra Modi), అమిత్‌ షా(Anit shah) విధానాలను విమర్శిస్తూ వస్తున్నారు. వరుణ్‌ చేస్తున్న కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వరుణ్‌గాంధీని బీజేపీ పొమ్మనలేక పొగబెడుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. వరుణ్‌గాంధీకి ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఒకవేళ కాంగ్రెస్‌ ఆఫర్‌ను వరుణ్‌గాంధీ ఒప్పుకుంటేమాత్రం దశాబ్దాలుగా గాంధీ కుటుంబం మధ్య కొనసాగుతున్న రాజకీయ శత్రుత్వానికి తెరపడుతుంది. అన్నదమ్ములైన రాహుల్‌గాంధీ(Rahul Gandhi), వరుణ్‌గాంధీ కలిసి నడిచే అవకాశం వస్తుంది. ఇటీవల కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chaudhary) వరుణ్ గాంధీని కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, అగ్నివీర్ యోజన, కేంద్ర ఉచిత రేషన్ స్కీమ్ మొదలైనవాటిపై వరుణ్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అందుకే బీజేపీ వరుణ్‌కు టిక్కెట్‌ కేటాయించలేదు. ఆయన తల్లి మేనకాగాంధీకి మాత్రం బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు తల్లిని వదిలేసి వరుణ్‌ కాంగ్రెస్‌కు వెళతారా? లేక బీజేపీలోనే కొనసాగుతారా అన్నది చూడాలి.

Updated On 27 March 2024 12:11 AM GMT
Ehatv

Ehatv

Next Story