ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఒకప్పటి ఆ గ్లామర్‌ హీరోయిన్‌ కోరిక. రాజకీయాలలో సుదీర్ఘకాలం ఉన్న ఆమెకు ఇలాంటి కోరిక కలగడంలో ఆశ్చర్యం లేదు. పైగా లోక్‌సభ(Lok sabha) సభ్యురాలుగా పని చేసిన ఆమెకు ఆ హోదా ఎలాంటి గౌరవాన్ని ఇస్తుందో తెలియంది కాదు! స్టార్‌ క్యాంపెయిన్‌గా తెలుగుదేశం పార్టీ(TDP) -జనసేన(Janasena)-బీజేపీ(BJP) కూటమికి తరఫున ప్రచారం చేయాలని తెగ ఉత్సాహం చూపిస్తున్నా కూటమి నుంచి మాత్రం ఎలాంటి స్పందన ఇప్పటి వరకు రాలేదు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఒకప్పటి ఆ గ్లామర్‌ హీరోయిన్‌ కోరిక. రాజకీయాలలో సుదీర్ఘకాలం ఉన్న ఆమెకు ఇలాంటి కోరిక కలగడంలో ఆశ్చర్యం లేదు. పైగా లోక్‌సభ(Lok sabha) సభ్యురాలుగా పని చేసిన ఆమెకు ఆ హోదా ఎలాంటి గౌరవాన్ని ఇస్తుందో తెలియంది కాదు! స్టార్‌ క్యాంపెయిన్‌గా తెలుగుదేశం పార్టీ(TDP) -జనసేన(Janasena)-బీజేపీ(BJP) కూటమికి తరఫున ప్రచారం చేయాలని తెగ ఉత్సాహం చూపిస్తున్నా కూటమి నుంచి మాత్రం ఎలాంటి స్పందన ఇప్పటి వరకు రాలేదు. నిజానికి ఆమె సినిమా జీవితం ముగిసి చాన్నాళ్లయ్యింది. రాజకీయ జీవితం ముగిసి కూడా కొన్నేళ్లవుతుంది. ఈ నేపథ్యంలో ఆమెను ఈ తరం వారు గుర్తుపడతారన్నది అనుమానమే! ఆమె ఎవరో చెప్పలేదు కదూ! ఒకప్పటి టాలీవుడ్‌, బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ జయప్రద(Jayapradha). అప్పట్లో ఆమె అందాలనటి! సత్యజిత్‌ రాయ్‌ వంటి దిగ్దర్శకుడు ఆమె అందానికి ముగ్ధులయ్యారు. దాదాపు ఆనాటి అగ్రహీరోలందరి సరసనా నటించారు. ఇప్పుడామెను పట్టించుకునేవారే లేరు. ఇప్పటి జనరేషన్‌ ఆమెను గుర్తుపడుతుందా అన్నది అనుమానమే! ఆమె తెలుగువారికి దూరమయ్యి కూడా కొన్నేళ్లయ్యింది. తాను ఆంధ్రప్రదేశ్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, బీజేపీ అధినాయకత్వం అవకాశం ఇస్తే రెడీగా ఉన్నానని అప్పుడెప్పుడో చెప్పారు జయప్రద. ఆమె మాటలను, విన్నపాన్ని బీజేపీ(BJP) పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రచారం చేస్తానని అంటున్నారు. తనకు చంద్రబాబు(Chandrababu) ఆత్మీయుడని, బాలకృష్ణ(Balakrishna), పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) అంటే ఇష్టమని చెబుతూ కూటమిలోని పార్టీలు ఆహ్వానిస్తే తప్పకుండా ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు. తెలుగువారి కంటే ఉత్తరప్రదేశ్‌ వాసులకే జయప్రద ఎక్కువ పరిచయం. అందుకే బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్‌లో ఆమె ప్రచారం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ నుంచి ఆమె రెండుసార్లు విజయం సాధించారు. రెండు సార్లూ సమాజ్‌వాదీ పార్టీనే టికెట్‌ ఇచ్చింది. ఆమె రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ నుంచే మొదలయ్యింది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేసిన జయప్రద ఏపీ నుంచి ఓసారి ఎంపీ కూడా అయ్యారు. తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచ రెండుసార్లు ఎంపీ అయ్యాక అక్కడ్నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు బీజేపీ జిందాబాద్‌ అంటున్నారు. సరిగ్గా పదేళ్ల కిందట ఇదే జయప్రద, చంద్రబాబును బండబూతులు తిట్టారు. తనకు ఏపీ రాజకీయాలలో చోటు లభించకపోవడానికి చంద్రబాబే కారణమని విమర్శించారు. అదే చంద్రబాబు ఇప్పుడు ఆమెకు ఆత్మీయులయ్యారు. రాజకీయాలంటే ఇంతేనేమో!

Updated On 4 April 2024 4:47 AM GMT
Ehatv

Ehatv

Next Story